Wife and Husband Relationship: భార్యాభర్తల బంధం సజావుగా సాగాలంటే ఈ 7 టిప్స్‌ను పాటించండి..!

ABN , First Publish Date - 2022-07-23T21:00:08+05:30 IST

భార్యాభర్తల బంధంలో చిన్న చిన్న గ్యాప్స్ రావడం కూడా మామూలే. వీటిని ఫిల్ చేసుకునే బాధ్యత కూడా వారిద్దరి మీదే ఉంటుంది.

Wife and Husband Relationship: భార్యాభర్తల బంధం సజావుగా సాగాలంటే ఈ 7 టిప్స్‌ను పాటించండి..!

ప్రతివారి జీవితంలోకి పెళ్ళి తరువాత పిల్లలతో కొత్త బంధాలు ఏర్పడటం సహజమే. వాటితో భార్యాభర్తల బంధంలో చిన్న చిన్న గ్యాప్స్ రావడం కూడా మామూలే. వీటిని ఫిల్ చేసుకునే బాధ్యత కూడా వారిద్దరి మీదే ఉంటుంది. సంధ్యకు ఓ రెండేళ్ళ క్రితం పెళ్ళయింది. ఓ బిడ్డ పుట్టాకా భర్త తనతో తరచుగా ముభావంగా ఉంటున్నాడని ఫీలవుతూ తల్లితో చెప్పుకుంది. పెళ్ళయిన కొత్తలో ఆ తర్వాత బిడ్డ పుట్టక ముందు వరకూ తనతో ఎంతో ప్రేమగా ఉండే తన భార్య పూర్తిగా తన సమయాన్ని బిడ్డకే ఇవ్వడం భరించలేకపోతారు కొందరు భర్తలు.


పెళ్ళయిన కొత్తల్లో భర్తతో ఉండే ప్రేమ, దగ్గరితనం పిల్లలు కలిగాకా ఆడవారికి బిడ్డల మీదకు మళ్ళుతుందనే అపవాదు లేకపోలేదు. కానీ అప్పటివరకూ ఒకరి కూతురిగా, భార్యగా ఉన్న స్త్రీ తల్లిగా మారాకా తన బాధ్యతను పెంచుకుని ప్రేమను అటు భర్తకు ఇటు బిడ్డకు సమంగా పంచడంలో సతమతమౌతుంది. ఈ విషయంలో నిర్లష్యం చేస్తే ఇద్దరి మధ్యా బంధం దెబ్బతినవచ్చు.


ఈ దూరాన్ని ఎలా మెరుగుపరచుకోవచ్చో ఈ చిట్కాలు చూడండి:


1. వారానికొకసారి అలా బయటకు వెళ్ళడానికి చూడండి.

వారంలో ఒకరోజుని ఎంచుకుని ఆమెను బయటకు తీసుకువెళ్ళాలని చూడండి. లేదా అతనితో కాస్త సమయాన్ని ప్రత్యేకంగా గడపండి. అయితే మీరు గడిపే క్షణాలు మరీ ఖరీదైనవి కానక్కరలేదు. చిన్న పనే అలా బయటకు నడుస్తూ వెళ్ళడమో..వారితో సమయాన్ని గడపడానికి చూడండి. మీ జీవితంలో జరిగిన, జరుగుతున్న విషయాల గురించి చర్చించండి. ఇద్దరి మధ్యా సమస్యలు వాటి పరిష్కారాల గురించి మాట్లాడుకోండి.


2. ముఖ్యమైన సమస్య గురించి మాట్లాడే ముందు..

“మనం మాట్లాడుకోవడానికి ఇప్పుడు వీలవుతుందా?” అని అడగండి. మీరు చెప్పేది ఎదుటివారు వింటున్నారనేది నిర్ధారించుకోండి. వాళ్ళు ఏదైనా పనిలో ఉన్నప్పుడు లేదా ఎవరితోనైనా మాట్లాడాలని అనుకుంటున్నప్పుడో మీరు చెప్పాలనుకున్నది చెప్పకపోవడం మంచిది. అలాగే ఇద్దరూ ఏదైనా విషయాన్ని మాట్లాడటం ప్రారంభించినపుడు చేతిలో ఉన్న వస్తువులను పక్కన పెట్టి వాళ్ళు చెప్పేదానికి మీ నుంచి సమాధానాన్ని ఇస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల ఇద్దరికీ మధ్య మంచి రిలేషన్ ముఖ్యంగా గౌరవం ఏర్పడతాయి. 


3. చిన్న విషయాలలో ఇవ్వండి.

ఇవన్నీ చాలా చిన్న విషయాలు వీటి గురించి పెద్దగా ఆలోచించకు. అంటూ ధైర్యం చెప్పండి. బిడ్డ పుట్టాకా మన ఇద్దరి మధ్యా వచ్చిన ఈ చిన్న ఎడబాటును సరిచేసుకుందామనే ధైర్యాన్ని ఒకరికొకరు ఇచ్చుకోండి.


4. ‘ఐ లవ్ యు’ అని చెప్పడానికి చూడండి.

మీ భాగస్వామి ప్రేమను పొందడానికి వారికి ఇష్టమైన పనులు చేస్తూ వాటి ద్వారా మీకు వారి మీద ఉన్న ప్రేమను తెలపండి. 


5. ధైర్యాన్ని ఇవ్వండి.. 

ఇది పై విషయంతో సంబంధం ఉన్నట్టుగా అనిపించినా ఇది కాస్త వేరు. సుఖంలోనూ కష్టంలోనూ నేను నీకు తోడుగా ఉంటానని మీ మాటలతో చెపుతూ ధైర్యాన్ని ఇవ్వండి. ఇంటి పనుల్లో, బిడ్డను చూసుకోవడంలో ఇద్దరూ సాయం చేసుకోవడం మంచిది. 


6. మీ భావాలను ప్రేమపూర్వకంగా తెలియజేయండి.

మీ భావాలను తెలియజేయడం వల్ల ఎదుటివారికి బాధ కలుగుతుందనిపిస్తే వాటిని చెప్పకపోవడమే మంచిది. మీ బాధ, కోపం ఇలాంటివి కొన్ని సందర్భాలలో వారితో పంచుకోకపోవడమే మీకు మేలు చేస్తుంది. ఒకరినొకరు పేర్లు పెట్టుకోకండి. ఒకరినొకరు తక్కువ చేసుకోకండి. నిద్రపోయే ముందు సమస్యలను పరిష్కరించుకోవడానికి చూడండి.


7. మూడ్ తెలుసుకోండి.

మీ భాగస్వామితో శృంగారభరితంగా ఉండేందుకు సమయం కోసం వేచి చూడకండి.. కాస్త చొరవగా ప్రవర్తించి ఎదుటివారి మూడ్ ని తెలుసుకోండి. ఈ ఓపెన్ మైండ్ తో ఆలోచిస్తే మీ కుటుంబంతో ప్రేమగా గడపడానికి సహాయం చేస్తాయి. 

Updated Date - 2022-07-23T21:00:08+05:30 IST