కనిపించిందల్లా తినేసి లావైపోతున్నారా? ఆకలి లేకుండానే ఏదో ఒకటి లాగించేస్తున్నారా? అయితే మీ అలవాట్లను ఇలా చిటికెలో మార్చుకోండి..

ABN , First Publish Date - 2021-11-06T13:28:48+05:30 IST

బరువు తగ్గడం, బరువు పెరగడం.. ఈ రెండూ..

కనిపించిందల్లా తినేసి లావైపోతున్నారా? ఆకలి లేకుండానే ఏదో ఒకటి లాగించేస్తున్నారా? అయితే మీ అలవాట్లను ఇలా చిటికెలో మార్చుకోండి..

బరువు తగ్గడం, బరువు పెరగడం.. ఈ రెండూ అనుకున్నంత ఈజీ కాదు. బరువుతగ్గాలంటే మీ శరీరానికి తక్కువ క్యాలరీలు అందాలి. ఆకలి లేదా ఏదైనా తినాలనే కోరిక మిమ్మల్ని ఇంటినుంచి బయటకు తీసుకు వెళ్లి, రెస్టారెంట్‌లో కూర్చోబెడుతుంది. ఇది మీరు బరువు పెరగడానికి దారితీస్తుంది. తిండియావ అనేది ఆకలి లేకుండానే తినడానికి కారణంగా నిలుస్తుంది. ఇటువంటి అలవాటు బరువు పెరగడానికి దారితీయడంతో పాటు, వివిధ అనారోగ్యాలకు కారణంగా నిలుస్తుంది. అందుకే ఇటువంటి అలవాట్లు మార్చుకునేందుకు నిపుణులు తెలియజేసిన పరిష్కార మార్గాలను ఇక్కడ అందిస్తున్నాం.. 


భోజనానికి 30 నిముషాల మందు లేదా మీకు ఆకలి వేసినప్పుడు ఒక గ్లాసు నీటిని తాగండి. ఇది మీ ఆకలిని అదుపు చేస్తుంది. అప్పుడు సరైన మోతాదులో ఆహారం తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఆకలిని తగ్గించుకునేందుకు ఇదే అత్యంత సులభమార్గం.

మీ ఆహారంలో అత్యధికంగా ఫైబర్ ఉండేలా చూసుకోండి. ఫైబర్ కలిగిన ఆహారం మీకు సంతృప్తిని అందిస్తుంది. అలాగే మీ ఆహారంలో కూరగాయలు, పండ్లు అత్యధికంగా ఉండేలా చూసుకోండి. వీటిలో తక్కువ మోతాదులో క్యాలరీలు ఉంటాయి. ఇవి మీ తిండి యావను తగ్గిస్తాయి. 

ఆకలిని అదుపు చేసుకునేందుకు మారో మార్గముంది.. అదే చూయింగ్ గమ్ నమలడం. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడనప్పటికీ, ఆకలిని అదుపు చేయడానికి దోహదపడుతుంది. నాణ్యమైన చూయింగ్‌గమ్ నమలడం ద్వారా దాని రుచి ఆకలిని, తిండి యావను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. శరీరానికి అధిక క్యాలరీలు అందుతున్నాయన్న సమస్య తప్పుతుంది. 

పుష్కలంగా ప్రోటీస్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఎప్పుడూ ఏదో ఒకటి తినే అలవాటును తప్పించుకోవచ్చు. ప్రొటీన్లు మీకు చాలా సేపు ఆకలి కలగకుండా చేస్తాయి. ఆకలిని అదుపు చేసుకునేందుకు ఇదే అత్యుత్తమ మార్గం. గుడ్డులోని తెల్లని భాగం, పాల ఉత్పత్తులు, పప్పులు మొదలైన వాటిలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. 


వ్యాయామం వలన మీకు బరువు తగ్గినట్లు అనిపించినా, ఆకలి కూడా పెరుగుతుంది. అందుకే వ్యాయామం చేస్తూనే ఆహారపు అలవాట్లను మార్చుకునేందుకు ప్రయత్నించాలి.  

తగినంత నిద్రలేకపోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాగే అత్యధిక సమయం మేల్కొని ఉండటం వలన ఏదో ఒకటి తినాలనే యావ పెరుగుతుంది. ఇది అధిక బరువు పెరిగేందుకు దారి తీస్తుంది. 

ఎప్పుడూ ఏదోఒకటి తినాలనే ఆలోచనను తప్పించుకునేందుకు కొద్దిసేపు వాకింగ్ చేయడం, మంచి సంగీతం వినడం, స్నేహితులతో కబుర్లు చెప్పడం, మంచి పుస్తకం చదవటం లాంటివి చేయాలి. ఇటువంటి అలవాట్లు తిండియావను తగ్గించడమే కాకుండా మానసికంగా బలంగా తయారయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు తరచూ ఫుడ్ గురించి ఆలోచించకుండా ఉండగలుగుతారు. 

Updated Date - 2021-11-06T13:28:48+05:30 IST