ఆహారం.. ఎక్కువ కాలం!

ABN , First Publish Date - 2021-06-05T05:10:56+05:30 IST

కరోనా కాలంలో తరచూ బజారుకు వెళ్లి సరుకులు కొనే బదులు, ఒకేసారి ఎక్కువ మొత్తాల్లో కొని, ఇంట్లో నిల్వ చేసుకోవాలి. అయితే ఆ సరుకులు పాడైపోకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి.

ఆహారం.. ఎక్కువ కాలం!

కరోనా కాలంలో తరచూ బజారుకు వెళ్లి సరుకులు కొనే బదులు, ఒకేసారి ఎక్కువ మొత్తాల్లో కొని, ఇంట్లో నిల్వ చేసుకోవాలి. అయితే ఆ సరుకులు పాడైపోకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి.


తెల్ల బియ్యం:

పాలిష్‌ పట్టిన లేదా పాలిష్‌ పట్టని బియ్యం సరైన పరిస్థితుల్లో నిల్వ చేస్తే దాదాపు 30 ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉంటాయి. వాటిలోని పోషకాలు కూడా నిర్వీర్యం కావు. బియ్యాన్ని గాలి చొరబడని డబ్బాల్లో, 40 డిగ్రీల ఫారిన్‌హీట్‌ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయాలి. అయితే గోధుమ బియ్యం ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఆరు నెలలకు మించి నిల్వ ఉండదు. ఇందుకు కారణం దాన్లో సహజసిద్ధ నూనెలు ఉండడమే!


ఉప్పు: భూమిలోని సహజసిద్ధ ఖనిజలవణం రూపమే ‘సోడియం క్లోరైడ్‌’. కాబట్టే దీని నిల్వ కాలం ఎక్కువ. అయితే ఇదే గుణం ఆహారంలో ఉపయోగించే మెత్తని ఉప్పుకు ఉండదు. ఈ ఉప్పు తయారీలో భాగంగా జోడించే అయోడిన్‌ మూలంగా మెత్తని ఉప్పు నిల్వ సామర్ధ్యం తగ్గుతుంది. కాబట్టి ఉప్పు ప్యాకెట్లను ఒక్కొక్కటిగా వాడుకోవాలి. నిల్వ ఉంచిన ప్యాకెట్లకు రంధ్రాలు పడకుండా చూసుకోవాలి.

చక్కెర: చక్కెర తయారీకి అనుసరించే పద్ధతి మీద దాని నిల్వ కాలం ఆధారపడి ఉంటుంది. పలుకులుగా ఉన్న, మెత్తని చక్కెరలను తేమ లేని గాలి చొరబడని డబ్బాల్లో నిల్వ చేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.

కాచిన వెన్న: వెన్నలోని తేమ మొత్తం పోయేలా వేడి చేసి నిల్వ చేయాలి. కాచిన వెన్న లేదా నెయ్యిలను చల్లని ఉష్ణోగ్రత వద్ద, మూత బిగించిన సీసాల్లో నిల్వ చేస్తే దాదాపు వందేళ్లపాటు పాడవకుండా నిల్వ ఉంటాయి.  

వేయించిన పప్పుధాన్యాలు: కందులు, మినుములు, చిక్కుడు గింజలు, సోయా, రాజ్మా మొదలైనవి తేమ లేకుండా వేయించి నిల్వ చేస్తే నెలల తరబడి పాడవకుండా ఉంటాయి. అలాగే నిల్వ చేసే డబ్బాలో కొన్ని ఎండుమిర్చి తుంచి వేస్తే పప్పులకు పురుగు పట్టదు.

పాల పొడి: పాల పొడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కాబట్టే దూర సరఫరాలకు, నిల్వకు పాల కంటే పాల పొడి అనువుగా ఉంటోంది. కాబట్టి పాలపొడి డబ్బాలు పాలకు ప్రత్యామ్నాయంగా ఇంట్లో ఉంచుకోవచ్చు. 

Updated Date - 2021-06-05T05:10:56+05:30 IST