బూరి, పులిహోర వడ్డన ప్రారంభం

ABN , First Publish Date - 2022-08-08T06:09:54+05:30 IST

అప్పన పల్లి బాలబాలాజీ దేవస్థానంలో నిర్వ హిస్తున్న అన్నదాన కార్యక్రమం మిగిలిన దేవాలయాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పేర్కొన్నారు.

బూరి, పులిహోర వడ్డన ప్రారంభం

మామిడికుదురు, ఆగస్టు 7: అప్పన పల్లి  బాలబాలాజీ దేవస్థానంలో నిర్వ హిస్తున్న అన్నదాన కార్యక్రమం మిగిలిన దేవాలయాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పేర్కొన్నారు. కొవిడ్‌ కారణంగా అన్నదానంలో బూరి, పులిహోర వడ్డన నిలిపివేశారు. ఆదివారం అన్నదానంలో బూరి, పులిహోర వడ్డన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పునః ప్రారంభించారు. అన్నదానంలో బూరి, పులిహోర నిరంతరం వడ్డిస్తారన్నారు.   జడ్పీటీసీ కసిరెడ్డి అంజిబాబు, ఎంపీపీ కుసుమ వనజాకుమారి, దేవస్థానం చైర్మన్‌ చిట్టూరి రామకృష్ణ, సహాయ కమిషనర్‌ ఎంకేపీఎస్‌ వరప్రసాద్‌, స్థానిక సర్పంచ్‌ గెడ్డం మంగాలక్ష్మి, ఎంపీటీసీలు బొంతు నీలిమ, నెల్లి దుర్గాప్రసాద్‌, ట్రస్టీ చిట్టాల సత్తిబాబు, బత్తుల గంగారత్నం, పార్టీ నాయకులు పాల్గొన్నారు.  


  

Updated Date - 2022-08-08T06:09:54+05:30 IST