ఆహార ప్రణాళిక వేసుకుంటున్నారా!

ABN , First Publish Date - 2021-03-31T18:01:35+05:30 IST

ఆరోగ్యకరమైన ఆహారం గురించి ఆలోచించడం మొదలెట్టగానే పలు రకాల ఆహార నియమాలు, ఇవి చేయండి. ఇవి చేయకూడదు అనే షరతులు కొంత అయోమమానికి గురిచేస్తాయి. అయితే ఆహార ప్రణాళిక అనేది అనుకున్నంత సంక్లిష్టమైనది కాదు. కొన్ని పద్ధతులు పాటిస్తే ఆరోగ్యంగా, ఒకప్పటిలా చురుకుగా ఉంటారని చెబుతున్నారు ఫిట్‌నెస్‌, పోషకాహార నిపుణురాలు ఇషానీ వెల్లోడి రెడ్డి.

ఆహార ప్రణాళిక వేసుకుంటున్నారా!

ఆంధ్రజ్యోతి(31-03-2021)

ఆరోగ్యకరమైన ఆహారం గురించి ఆలోచించడం మొదలెట్టగానే పలు రకాల ఆహార నియమాలు, ఇవి చేయండి. ఇవి చేయకూడదు అనే షరతులు కొంత అయోమమానికి గురిచేస్తాయి. అయితే ఆహార ప్రణాళిక అనేది అనుకున్నంత సంక్లిష్టమైనది కాదు. కొన్ని పద్ధతులు పాటిస్తే ఆరోగ్యంగా, ఒకప్పటిలా చురుకుగా ఉంటారని చెబుతున్నారు ఫిట్‌నెస్‌, పోషకాహార నిపుణురాలు ఇషానీ వెల్లోడి రెడ్డి. 

ఇంకా ఆమె ఏం అంటున్నారంటే...

రోజుకు రెండు పూటలు అన్ని రకాల ఆహారధాన్యాలతో కూడిన భోజనం చేయాలి. కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా చేరతాయనే ఆందోళన వద్దు. ఎందుకంటే శరీరానికి కార్బొహైడ్రేట్లు అవసరం. శక్తిని ఇవ్వడంతో పాటు హార్మోన్ల సమతౌల్యానికి, జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఆకలిని తగ్గించేందుకు కార్బొహైడ్రేట్లు కావాలి. అయితే కేకులు, బ్రెడ్డు, వైట్‌ షుగర్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్‌లోని కార్బొహైడ్రేట్స్‌ హాని చేస్తాయి. వీటికి బదులుగా చిరుధాన్యాలు, ఓట్స్‌, బ్రౌన్‌ రైస్‌ వంటివి తినాలి.

అన్‌శాచురేట్‌ ఫ్యాట్స్‌ గుండె ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటిలో ఒమోగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఆందోళన, వాపును తగ్గిస్తాయి. హార్మోన్ల సమతౌల్యానికి పనికొస్తాయి. చియా, అవిసె గింజలు, వాల్‌నట్స్‌, సాల్మన్‌ చేపలలో ఈ ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా లభిస్తాయి. అలాగే అవకాడో, ఆలివ్‌ నూనె, నట్స్‌ అప్పుడప్పుడూ తింటుంటే శరీరానికి ఆరోగ్యకరమైన ఫ్యాట్స్‌ అందుతాయి.

రోజువారీ ఆహారంలో కనీసం మూడు కప్పుల ఆకుకూరలు, పిండి పదార్థం తక్కువ ఉన్న కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరల్లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. పిండి పదార్థం తక్కువ ఉండే కూరగాయల్లో పీచుపదార్థం మెండుగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఒకేలా ఉండేందుకు, జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేసేందుకు పీచుపదార్థం చాలా ముఖ్యం.

Updated Date - 2021-03-31T18:01:35+05:30 IST