Pregnancy Food: గర్భవతులకు మేలు చేసే ఆహారం.. తయారు చేయడం చాలా ఈజీ..!

ABN , First Publish Date - 2022-07-26T20:16:15+05:30 IST

గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు ఇతర పోషకాలతో పాటు ఇనుముతో కూడిన ఆహారం తీసుకోవాలి. కాలా చనా లేదా నల్ల చిక్‌పీస్ లో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనతను నివారించవచ్చు, కాబట్టి ఈ రెసిపీ గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులు తీసుకుంటే మంచిది.

Pregnancy Food: గర్భవతులకు మేలు చేసే ఆహారం.. తయారు చేయడం చాలా ఈజీ..!

ఇప్పటి కాలంలో ఏది తిన్నా అరుగుదలకు రాకపోవడం, తిన్నాకా ఇబ్బంది పడటం మామూలే. ఇక పోషకాహారం సంగతి సరే సరి. అదంతా పెద్ద ప్రోసెస్ ఎవరు చేసుకుంటారని.. సులువుగా నో చెప్పేస్తుంటారు. కానీ గర్భిణులకు, పాలిస్తున్న తల్లులకు కొన్ని పోషకాలు తప్పని సరి. వారిలో ఆరోగ్యంతోపాటు పోషకాలు తీసుకోవడం బిడ్డల ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి. కనుక కాస్త శ్రద్ధ తీసుకోక తప్పదు. ఈ చిన్న రెసిపీతో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండిలా. 


ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత లేదా రక్తంలో తక్కువ స్థాయి హిమోగ్లోబిన్ తో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు ఇతర పోషకాలతో పాటు ఇనుముతో కూడిన ఆహారం తీసుకోవాలి. కాలా చనా లేదా నల్ల చిక్‌పీస్ లో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనతను నివారించవచ్చు, కాబట్టి ఈ రెసిపీ గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులు తీసుకుంటే మంచిది.


ఇందులో..

* ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది, కాబట్టి అవి పేగు ఆరోగ్యానికి, మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది. 

* మొక్క ఆధారిత ప్రోటీన్ వల్ల జుట్టు రాలడాన్ని నిరోధించవచ్చు. 


ఈ వంటకం చర్మానికి కూడా అద్భుతాలు ఇస్తుంది, ఎందుకంటే కాలా చనాలో మాంగనీస్ ఉండటంతో వృద్ధాప్యంతో పోరాడటానికి సహాయపడుతుంది, అలాగే సలాడ్ కూరగాయలు తో పాటు టమోటాలు, దోసకాయ, బెల్ పెప్పర్ కలిపి డిష్ చేస్తే ఇతర పోషకాలు కూడా కలిసి త్వరగా జీర్ణం అవుతుంది.


కావలసినవి.

ఉడకబెట్టిన నల్ల చిక్పీస్

టమోటా ముక్కులు, తరిగినంత

దోసకాయ ముక్కలు, తరిగినంత

బెల్ పెప్పర్ ముక్కలు, తరిగినంత

నిమ్మకాయ చెక్క

రుచికి కొద్దిగా చాట్ మసాలా

కొద్దిగా ఉప్పు.


తయారు చేసే పద్ధతి..

ఒక గిన్నెలో, ఉడికించిన చిక్‌పీస్, కూరగాయలను కలపండి.

కొద్దిగా నిమ్మకాయ, ఉప్పు, చాట్ మసాలా చల్లండి. 

ఇది తినడానికి రుచికరంగా ఉండడమే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ ముందుంటుంది. 

చాలా ఈజీగా చేసుకునే ఈ రెసిపీతో ఎన్ని ఉపయోగాలో చూసారుగా.. ట్రై చేయండి మరి. 


Updated Date - 2022-07-26T20:16:15+05:30 IST