అన్నం తిన్నా, నీళ్లు తాగినా.. పొట్లలోకి వెళ్లకుండా మెడలోంచి బయటకు వచ్చేస్తోంది.. కనీవినీ ఎరుగని విచిత్ర కేసు.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-11-07T01:55:20+05:30 IST

సాధారణంగా మనం ఏం తిన్నా.. అది నేరుగా జీర్ణాయశంలోకి వెళ్తుంది. అయితే ఒక వ్యక్తం మాత్రం అలా జరగడం లేదు. అన్నం తిన్నా, నీళ్లు తాగినా.. ఇతర ఏ పదార్థాలను తీసుకున్నా అవి పొట్టలోకి వెళ్లకుండా మెడలోంచే బయటకు వచ్చేస్తున్నాయి. దీం

అన్నం తిన్నా, నీళ్లు తాగినా.. పొట్లలోకి వెళ్లకుండా మెడలోంచి బయటకు వచ్చేస్తోంది.. కనీవినీ ఎరుగని విచిత్ర కేసు.. అసలేం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా మనం ఏం తిన్నా.. అది నేరుగా జీర్ణాయశంలోకి వెళ్తుంది. అయితే ఒక వ్యక్తం మాత్రం అలా జరగడం లేదు. అన్నం తిన్నా, నీళ్లు తాగినా.. ఇతర ఏ పదార్థాలను తీసుకున్నా అవి పొట్టలోకి వెళ్లకుండా మెడలోంచే బయటకు వచ్చేస్తున్నాయి. దీంతో అతడి పరిస్థితి దారుణంగా తయారైంది. స్థానికంగా ఉన్న ఏ ఆసుపత్రికి వెళ్లినా అతడి సమస్యకు పరిష్కారం లభించలేదు. కాగా.. ఇంతకూ అతడి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది. అతడి సమస్యకు పరిష్కారం లభించిందా లేదా.. కనీవినీ ఎరుగని విచిత్ర కేసుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. 


బిహార్‌లోని పాట్నాకు చెందిన 30ఏళ్ల యువకుడు.. కొన్ని రోజులుగా వింత సమస్యతో బాధపతున్నాడు. అతడి మెడ భాగంలో రంధ్రం ఏర్పడటంతో ఏం తిన్నా.. తాగినా అవి పొట్టలోకి వెళ్లకుండా మెడలోంచే భయటకొస్తున్నాయి. ఈ క్రమంలో అతడి పరిస్థితి దారుణంగా తయారైంది. ఒంట్లో శక్తి.. క్రమంగా తగ్గిపోయింది. ఈ క్రమంలనే స్థానికంగా ఉన్న ఆసుపత్రులను అతడు సందర్శించాడు. అయితే అక్కడి డాక్టర్లు చేతులెత్తేశారు. ఈ క్రమంలోనే పాట్నాలోని ఓ ప్రముఖ ఆసుపత్రిని అతడు సందర్శించాడు. దీంతో అతడికి సంజీవ్ కుమార్ అనే వైద్యుడు వైద్య పరీక్షలు చేశారు. చివరగా అతడి మెడ భాగంలో ఉన్న ఓ ఇంప్లాంట్ కారణంగానే ఆ యువకుడు సమస్యతో బాధపతున్నట్టు గుర్తించారు. అంతేకాకుండా ఇంప్లాంట్‌కు సంబంధించిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో.. తాను కొన్ని రోజుల క్రితం ఓ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడ్డట్లు చెప్పాడు. 



ఆ యాక్సిడెంట్‌లో తన మెడ భాగంలో ఉన్న వెన్నుముఖ దెబ్బతిందని.. ఈ క్రమంలోనే వైద్యులు ఆపరేషన్ చేసి, సరిచేసినట్లు వివరించారు. అది విన్న వైద్యులు.. అతడికి సమస్యను వివరించారు. ఆపరేషన్ సందర్భంగా వేసిన ఇంప్లాంట్ కారణంగానే ప్రస్తుతం ఈ సమస్య తలెత్తిందని చెప్పారు. ఇంప్లాంట్ మూలంగా అన్నవాహికకు రంధ్రం ఏర్పడంతో.. ఏం తిన్నా.. తాగినా ఆపరేషన్ చేసిన భాగం నుంచి బయటకు వచ్చేస్తున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా మళ్లీ ఆపరేషన్ చేసి, దాన్ని సరిచేయాలని స్పష్టం చేశారు. దానికి అతడు అంగీకరించడంతో.. ఆపరేషన్ చేసి, సమస్యకు వైద్యులు పుల్‌స్టాం పెట్టారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. ఇటువంటి కేసు బిహార్‌లో ఇప్పటి వరకు నమోదు కాలేదని పేర్కొన్నారు. వైద్యుల బృందం అతడికి 6 గంటలపాటు ఆపరేషన్ చేసినట్టు వెల్లడించారు. అంతేకాకుండా 10 రోజుల్లోగా అతడు సాధారణ స్థితికి చేరుకుంటాడని తెలిపారు. 




Updated Date - 2021-11-07T01:55:20+05:30 IST