వివక్షపై పోరాడిన నవయుగ వైతాళికుడు ఫూలే

ABN , First Publish Date - 2021-11-29T06:15:42+05:30 IST

అంటరానితనం, కులవివక్షతపై తన జీవితాంతం పోరాడిన నవయుగ వైతాళికుడు జ్యోతిరావు ఫూలే అని టీడీపీ నేతలు పేర్కొన్నారు.

వివక్షపై పోరాడిన నవయుగ వైతాళికుడు ఫూలే

టీడీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా ఫూలే జయంతి 

నివాళులర్పించిన జనసేన, వైసీపీ

వన్‌టౌన్‌, నవంబరు 28 : అంటరానితనం, కులవివక్షతపై తన జీవితాంతం పోరాడిన నవయుగ వైతాళికుడు జ్యోతిరావు ఫూలే అని టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఫూలే జయంతి సందర్భంగా ఆదివారం టీడీపీ జిల్లా కార్యాలయం లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ముఖ్య నేతలు ఫూలే జీవితాన్ని వివరించారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకున్న ఎన్టీఆర్‌ సీఎం గా బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నా రు. అదేమార్గంలో మాజీ సీఎం చంద్రబాబు నడుస్తున్నార న్నారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, రాష్ట్ర కార్యదర్శి గన్నే వెంకటనారాయణ ప్రసాద్‌, కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, చెన్నుపాటి ఉషారాణి, నేతలు కుర్ర నరేంద్ర, గద్దె వెంకటేశ్వర  ప్రసాద్‌, గరిమెళ్ల నరేంద్ర, బోయిన సుబ్రహ్మ ణ్యం, ఉప్పిడి రాము, పామర్తి కిషోర్‌బాబు, వాకా వెంకటేశ్వరరావు గౌడ్‌, పొన్నం రవికుమార్‌, కోడూరు ఆంజనేయ వాసు, ఎన్‌.నాగేశ్వరరావు, ఈ.అజయ్‌, చండ్రకిషోర్‌, హర్షవర్దన్‌, కొర్రపాటి శ్రీను, నాగూర్‌ బాబు  పాల్గొన్నారు.

బీసీల వెన్నెముక విరిచేస్తున్న జగన్‌ : పోతిన

బీసీల వెన్నెముకను సీఎం జగన్‌ విరిచేస్తున్నారని జనసేన నగరాధ్యక్షుడు, పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహే ష్‌ అన్నారు. ఫూలే జయంతి సందర్భంగా కళాక్షేత్రం వద్ద ఉన్న ఫూలే విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్‌ వలంటీర్లతో బీసీల సమాచారం సేకరించి సుప్రీంకోర్టులో ఫైల్‌చేసి ఉంటే స్థానిక ఎన్నికల్లో బీసీలు 10శాతం సీట్లు కోల్పోయి ఉండేవారు కాదన్నారు. జన సేన, బీసీ సంఘం, ధార్మిక సేవామండలికి చెందిన వెన్నా శివశంకర్‌, శనివారపు శివ, కృష్ణమోహన్‌, మురళీకృష్ణ, వల రజని, పసుపులేటి విజయలక్ష్మి,పిళ్ల శ్రీనివాసరావు, జ్యోతి, బొలిశెట్టి వంశీకృష్ణ, పిల్లి శ్రీనివాసరావు, కూరాకుల సురేష్‌, బాదరాల శివ, రాము, మరుపిళ్ల చిన్నారావు, రాజానాయుడు, సోమశేఖర్‌, గంగాధర్‌, వడ్డాది రాజేష్‌, పండు, సాంబశివ, దేవకృష్ణ, రాజేష్‌, ప్రసాద్‌, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

బీసీల అభ్యున్నతికి పాటుపడుతున్న సీఎం : జోగి

ఫూలే ఆశయాలను పుణికి పుచ్చుకుని బీసీల అభ్యున్నతి కి పాటుపడుతున్న ఏకైక సీఎం జగన్మోహనరెడ్డి అని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ అన్నారు. స్థానిక కళాక్షేత్రం వద్ద ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ నగరాధ్యక్షుడు బొప్పన భవకుమార్‌, మేయర్‌ రాయ న భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు బెల్లందుర్గ, అవుతు శైలజ, బొడ్డు అప్పలకొండమ్మ, బండి పుణ్యశీల, వెంకట సత్యనారాయణ, దాడి అప్పారావు,కోనేరు ప్రియ, తంగిరాల రామిరెడ్డి, విశ్వనాథపల్లి రవి, కాలే పుల్లారావు, బూదాల శ్రీను, మహబూబ్‌, మధిర ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-29T06:15:42+05:30 IST