మారడోనా మృతికి కొసరాజు సంతాపం

ABN , First Publish Date - 2020-11-27T04:59:03+05:30 IST

సాధారణ కుటుంబం నుంచి వచ్చి తన ఫుట్‌బాల్‌ క్రీడా ప్రతిభతో ప్రపంచవ్యాప్త గుర్తింపు సొంతం చేసుకున్న అర్జెంటీనా క్రీడాకారుడు డిగో మారడోనా (60) మృతి దిగ్ర్భాంతికి గురిచేసిందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫుట్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు కొసరాజు గోపాలకృష్ణ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

మారడోనా మృతికి కొసరాజు సంతాపం
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫుట్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు కొసరాజు గోపాలకృష్ణ

విశాఖపట్నం (స్పోర్ట్సు), నవంబరు 26: సాధారణ కుటుంబం నుంచి వచ్చి తన ఫుట్‌బాల్‌ క్రీడా ప్రతిభతో ప్రపంచవ్యాప్త గుర్తింపు సొంతం చేసుకున్న అర్జెంటీనా క్రీడాకారుడు డిగో మారడోనా (60) మృతి దిగ్ర్భాంతికి గురిచేసిందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫుట్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు కొసరాజు గోపాలకృష్ణ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యధిక శాతం అభిమానులను సొంతం చేసుకున్న ఫుట్‌బాలర్‌గా మారడోనా చరిత్ర సృష్టించాడన్నారు. మెక్సికోలో 1986లో జరిగిన ఫిఫా వరల్డ్‌ కప్‌లో ఇంగ్లండ్‌పై చేసిన తొలిగోల్‌ వివాదాస్పంగా మారినా అభిమానులు మారడోనాకే  జేజేలు పలకడమే అతని క్రీడా ప్రతిభకు నిదర్శనమన్నారు. ఆ గోల్‌ను ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌‘ గా వర్ణిస్తూ మారడోనా చేసిన వ్యాఖ్య ఫుట్‌బాల్‌ క్రీడకు టాగ్‌ లైన్‌గా మారిందని కొసరాజు వ్యాఖ్యానించారు. 1986లో అర్జెంటీనాకు ఫిఫా వరల్డ్‌ కప్‌ అందించి విశ్వవ్యాప్తంగా క్రీడాభిమానుల మారడోనా మృతి ఫుట్‌బాల్‌ రంగానికి తీరని లోటన్నారు. 2017లో తొలిసారి భారత్‌లో అడుగుపెట్టి కోల్‌కతాలో జరిగిన డిగో వెర్సస్‌ దాదా ఎగ్జిబిషన్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో సౌరబ్‌గంగూలీతో  పాల్గొని భారత ఫుట్‌బాల్‌ క్రీడాభిమానులను మారడోనా మంత్ర ముగ్దులను చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 

Updated Date - 2020-11-27T04:59:03+05:30 IST