పునరాగమనంపై ఆసక్తికర విషయాలు పంచుకున్న Dinesh Karthik..

ABN , First Publish Date - 2022-06-17T01:52:16+05:30 IST

ఐపీఎల్ 2022(IPL)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal challengers bangalure) తరపున అద్భుతంగా రాణించి టీమిండియాలోకి పునరాగమనం చేసి

పునరాగమనంపై ఆసక్తికర విషయాలు పంచుకున్న Dinesh Karthik..

రాజ్‌కోట్: ఐపీఎల్ 2022(IPL)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal challengers bangalure) తరపున అద్భుతంగా రాణించి టీమిండియాలోకి పునరాగమనం చేసిన 37 ఏళ్ల దినేష్ కార్తీక్(Dinesh Karthik) పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. జట్టులోకి మళ్లీ అడుగుపెట్టడంపై తన అనుభూతిని దక్షిణాఫ్రికా(South Africa)పై టీ20 సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్‌ వేదికగా 4వ మ్యాచ్‌కు ముందు పంచుకున్నాడు. భారత జట్టులోకి పునరాగమనం కోసం మూడేళ్ల కంటే ఎక్కువ సమయం ఎదురుచూశానని కార్తీక్ తెలిపాడు. జట్టులోకి అడుగుపెట్టాక ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తున్నానని ఆనందాన్ని చెప్పాడు. ఈ మేరకు దినేష్ కార్తీక్ స్పెషల్ ఇంటర్వ్యూ వీడియోని బీసీసీఐ(BCCI) ట్విటర్ వేదికగా షేర్ చేసింది.


దినేష్ కార్తీక్ మాటల్లో.. ‘‘ భారత జట్టుకు వెలుపల మూడేళ్లకుపైగానే ఎదురుచూశాను. అంతగా వేచిచూసిన నాకు జట్టులో చోటుదక్కడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది. రెండవసారి భారత జట్టులో ఆడడాన్ని ఆస్వాదిస్తున్నాను, చాలా గొప్పగా అనిపిస్తోంది. పునరాగమనం కోసం నడుం వంచి కృషి చేశాను. టీమిండియా జెర్సీ ధరించాను. భారత్ తరపున ప్రాతినిధ్యం వహించాలని ప్రతిరోజూ కలగనేవాడిని. గత దశాబ్దకాలంగా ఈ దృక్పథంతో ముందుకు  కదులుతున్నాను.’’ అని దినేష్ కార్తీక్ వెల్లడించారు. కాగా ప్రస్తుతం దక్షిణాఫ్రికా సిరీస్‌లో దినేష్ మూడు 3 మ్యాచ్‌లూ ఆడాడు. వరుస మ్యాచుల్లో 1(నాటౌట్), 30(నాటౌట్), 6 చొప్పున పరుగులు చేసి చేశాడు. కాగా ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచుల్లో దక్షిణాఫ్రికా 2, భారత్ 1 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఇక 4వ టీ20 మ్యాచ్ రాజ్‌కోట్ వేదికగా శుక్రవారం ఇరుజట్లు తలపడనున్నాయి.

Updated Date - 2022-06-17T01:52:16+05:30 IST