Man Thrown Out Of Train : వాటర్ బాటిల్ విషయంలో గొడవ.. ఆ తర్వాత రైలు వంటగది సిబ్బంది నిర్వాకమిదీ..

ABN , First Publish Date - 2022-08-08T22:59:06+05:30 IST

ఓ యువకుడి పట్ల రైలు వంటగది(Pantry) సిబ్బంది అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌(Uttarpradesh)లో వెలుగుచూసింది. వా

Man Thrown Out Of Train : వాటర్ బాటిల్ విషయంలో గొడవ.. ఆ తర్వాత రైలు వంటగది సిబ్బంది నిర్వాకమిదీ..

ఝాన్సీ : ఓ యువకుడి పట్ల రైలు వంటగది(Pantry) సిబ్బంది అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌(Uttarpradesh)లో వెలుగుచూసింది. వాటర్ బాటిల్(Water bottle) కొనుగోలు, పాన్ మసాలా ఉమ్మడంపై తలెత్తిన గొడవలో రవి యాదవ్ అనే 26 ఏళ్ల యువకుడిని కదిలే రైలు(train) నుంచి కిందకు తోసేశారు. బాధిత యువకుడు తన సోదరితో కలిసి రప్తీసాగర్ ఎక్స్‌ప్రెస్(12591)లో (Raptisagar Express) శనివారం ప్రయాణించాడు. రైలు జిరోలీ అనే గ్రామానికి సమీపిస్తుండగా వాటర్ బాటిల్ కొనుగోలు విషయంలో వంట గది సిబ్బంది, రవి యాదవ్ మధ్య ఘర్షణ జరిగింది. గొడవ కారణంగా రైలు దిగేయాలని తోబుట్టువులు నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టే లలిత్‌పూర్ స్టేషన్‌లో  సోదరి రైలు దిగింది. కానీ రవి యాదవ్‌ రైలు దిగకుండా వంటగది సిబ్బంది అడ్డుకున్నారు. రైలు కదిలాక రవిని తీవ్రంగా కొట్టారు. కదులుతున్న రైలు నుంచి కిందకు తోసేశారు. గ్రామం శివార్లు కావడంతో గ్రామస్థులు గుర్తించారు. వెంటనే సమీపంలోని ఝాన్సీ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించడంతో రవి యాదవ్‌కి ప్రాణాపాయం తప్పిందని పోలీసులు వివరించారు. ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ జిల్లా ఝాన్సీలో ఈ ఘటన జరిగింది.


బాధితుడు రవి యాదవ్ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశామని ఝాన్సీ పోలీసులు వివరించారు. ఐపీసీ సెక్షన్లు 323, 325, 506 కింద కేసులు నమోదు చేశామని గవర్నమెంట్ రైల్వే పోలీస్ సర్కిల్ ఆఫీసర్ మొహమ్మద నయీం వెల్లడించారు. అరెస్టయిన వ్యక్తిని అమిత్‌గా గుర్తించామని, సమగ్ర దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.

Updated Date - 2022-08-08T22:59:06+05:30 IST