అందమైన కళ్ల కోసం..

ABN , First Publish Date - 2021-03-10T05:30:00+05:30 IST

అర టీస్పూను కీరారసంలో కొద్దిగా రోజ్‌వాటర్‌ కలిపి ఆ మిశ్రమాన్ని కళ్లకు రాసుకొని అలాగే అరగంటసేపు ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో కళ్లను కడుక్కోవాలి. ఇలా చేస్తే నేత్రాలు అందంగా కనిపిస్తాయి.

అందమైన కళ్ల కోసం..

చూడగానే ఎదుటివారిని ఆకర్షించేవి కళ్లే. ఆ కళ్ల సంరక్షణ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అవేమిటంటే...

  • అర టీస్పూను కీరారసంలో కొద్దిగా రోజ్‌వాటర్‌ కలిపి ఆ మిశ్రమాన్ని కళ్లకు రాసుకొని అలాగే అరగంటసేపు ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో కళ్లను కడుక్కోవాలి. ఇలా చేస్తే నేత్రాలు అందంగా కనిపిస్తాయి. 
  • ఎక్కువ సేపు నిద్రపోతే కళ్లకు తగినంత విశ్రాంతి లభిస్తుంది. కళ్లకు అలసట లేకుండా చూసుకోవడం కూడా ముఖ్యమే.
  • గ్లాసు నీటిలో ఉసిరిపొడి నానబెట్టి ఉదయాన్నే ఆ నీళ్లతో కళ్లను కడుక్కుంటే కళ్లు స్వచ్ఛంగా కనిపిస్తాయి.
  • కళ్ల చుట్టూ ఉన్న ముడతలు పోవాలంటే కళ్ల కింద పాలమీగడ రాసుకొని మసాజ్‌ చేయాలి. ఇలా చేస్తే ముడతలు పోతాయి.
  • బాదం నూనెలో కొంచెం ఆలివ్‌ ఆయిల్‌ని కలిపి కంటి చుట్టూ ఉండే నలుపు ప్రాంతంపై రాస్తే ఆ నలుపు పోతుంది. 
  • రోజూ పావుగంటపాటు రెండు చేతులను రెండు కళ్లపై ఉంచుకుని ప్రశాంతంగా కూర్చుంటే కళ్లకు సాంత్వనగా ఉంటుంది.
  • ఉప్పు నీటితో కళ్లను కడుక్కుంటే కళ్లు మెరుస్తాయి. కళ్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నప్పుడు మేక్‌పకు దూరంగా ఉండాలి. 

Updated Date - 2021-03-10T05:30:00+05:30 IST