ఒత్తైన జుట్టు కోసం..!

ABN , First Publish Date - 2021-03-15T05:30:00+05:30 IST

జుట్టు రాలిపోతుంటే ఆందోళన చెందడం చాలా సహజం. అయితే జుట్టు రాలే సమస్య ఎక్కువ ఉన్నట్టయితే నిర్లక్ష్యం చేయకూడదు. జుట్టు సంరక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటంటే...

ఒత్తైన జుట్టు కోసం..!

జుట్టు రాలిపోతుంటే ఆందోళన చెందడం చాలా సహజం. అయితే జుట్టు రాలే సమస్య ఎక్కువ ఉన్నట్టయితే నిర్లక్ష్యం చేయకూడదు. జుట్టు సంరక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటంటే...


మసాజ్‌: తరచూ మసాజ్‌ చేస్తుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. రక్తప్రసరణ మెరుగుపడి తిరిగి వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి. హెయిర్‌ ఆయిల్స్‌, హెయిర్‌ మాస్కులను వేసుకోవడం వల్ల కూడా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మసాజ్‌తో అలసట, ఒత్తిళ్లు కూడా పోతాయి.


అలొవెరా: జుట్టు రాలిపోవడాన్ని కలబంద బాగా నివారిస్తుంది. ఇది జుట్టుకు కండిషనర్‌గా పనిచేయడమే కాకుండా వెంట్రుకలను మృదువుగా చేస్తుంది. చుండ్రు సమస్య ఉంటే సైతం పోతుంది. అయితే స్వచ్ఛమైన కలబంద జెల్‌ను ఉపయోగించాలి. వారంలో రెండు మూడుసార్లు ఉపయోగించవచ్చు. అలోవెరా షాంపూ, కండిషనర్లను  వాడితే మంచిది.


కొబ్బరినూనె: ఇందులో ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు లోపలికి  పోయి శిరోజాల్లోని ప్రొటీన్‌ లోపాలను తగ్గిస్తాయి. కొబ్బరినూనెను తల స్నానం ముందు లేదా తర్వాత పట్టించుకోవాలి. రాత్రి  నూనె రాసుకుని ఉదయం తలస్నానం చేయొచ్చు. కొబ్బరి నూనె వాడడం వల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.


వివిస్కాల్‌: వెంట్రుకలు పెరగడానికి తోడ్పడే సహజమైన సప్లిమెంట్‌ ఇది. పలుచని జుట్టు ఉన్నవాళ్లు దీన్ని వాడితే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ సప్లిమెంటులో అమినోమార్‌ సి అనే పదార్థం ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలు, మొల్యూస్క్‌ పొడి ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇవి కొత్త కణాలను తిరిగి పునరుత్పత్తి చేస్తాయి. అంతేకాదు ఉన్న కణ సంపదను మరింత బలోపేతం చేస్తాయి. వివిస్కల్‌తో చేసిన షాంపూ, కండిషనర్లు కూడా మార్కెట్లో లభిస్తాయి. 


చేపనూనె: ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్‌ వల్ల కూడా శిరోజాలు బాగా పెరుగుతాయి. ఒమేగా ఫ్యాటీ యాసిడ్ల వల్ల కణాల పనితీరు కూడా సరిగ్గా ఉంటుంది. శరీరంలో ఇవి రోగనిరోధకశక్తిని పెంచుతాయి. 


జిన్‌సెంగ్‌: ఈ సప్లిమెంట్లు జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడం ద్వారా వెంట్రుకలు పెరిగేట్టు చేస్తాయి. 


జెరానియం నూనె: ఇది కూడా జుట్టు పెరుగుదలకు ఎంతో తోడ్పడుతుంది. జుట్టుకు రక్తప్రసరణ జరిగేలా సహకరిస్తుంది. నిత్యం వాడే నూనెలో ఈ నూనె చుక్కలను కొన్ని వేసి హెయిర్‌ మాస్కుగా జుట్టుకు రాసుకోవచ్చు. షాంపు, కండిషనర్లలో కూడా ఈ నూనె చుక్కల్ని కొన్ని వేసుకొని దాన్ని తలపై అప్లై చేసుకోవచ్చు. 


నిమ్మ నూనె: తాజా నిమ్మరసం లేదా నిమ్మ నూనెను తలకు పట్టిస్తే శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. తాజా నిమ్మరసాన్ని తలకు రాసుకుని పదిహేను నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత జుట్టుకు షాంపు పెట్టుకుని తలస్నానం చేయాలి. నిత్యం తలకు రాసుకునే నూనెలో లెమన్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ కొన్ని చుక్కలని కలిపి పలుచగా చేసి దాన్ని హెయిర్‌ మాస్కుగా వెంట్రుకలకు పట్టించుకోవచ్చు.

Updated Date - 2021-03-15T05:30:00+05:30 IST