జీర్ణశక్తి పెరగాలంటే...

ABN , First Publish Date - 2021-05-19T16:29:35+05:30 IST

ఆరోగ్యంగా ఉండాలంటే జీర్ణశక్తి బాగుండాలి. తరువాత మిగిలిన వ్యర్థాలు సరిగ్గా బయటకు వెళ్లాలి. జీర్ణశక్తి పెరగాలంటే ఇదిగో ఇలా చేయాలి...

జీర్ణశక్తి పెరగాలంటే...

ఆంధ్రజ్యోతి(19-05-2021)

ఆరోగ్యంగా ఉండాలంటే జీర్ణశక్తి బాగుండాలి. తరువాత మిగిలిన వ్యర్థాలు సరిగ్గా బయటకు వెళ్లాలి.  జీర్ణశక్తి పెరగాలంటే ఇదిగో ఇలా చేయాలి...


ఉదయాన్నే ఒక కప్పు నిమ్మరసం తాగాలి. కొన్ని అల్లం ముక్కలకు నిమ్మరసం అద్దుకుంటూ, ఉప్పుతో కలిపి తినాలి. భోజనానికి 15 నిమిషాల ముందు ఇలా తీసుకుంటే డైజెస్టివ్‌ ఎంజైమ్స్‌ స్టిమ్యులేట్‌ అవుతాయి. 

సూర్యాస్తమయం కంటే ముందే భోజనం పూర్తిచేయాలి. అది కూడా చాలా తక్కువగా తీసుకోవాలి. సూప్స్‌లాంటివి తీసుకుంటే మరీ మంచిది. డిటాక్స్‌ ప్రక్రియకు ఇది బాగా ఉపకరిస్తుంది.

పసుపు, అల్లం, కొత్తిమీర, మిరియాలు, దాల్చినచెక్క, యాలకులు, జాజికాయ, జీలకర్ర... ఈ పదార్థాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

అల్లం టీ లేక అల్లంతో చేసిన ఇతర పానీయాలను తీసుకోవాలి. రాత్రివేళ అల్లం తీసుకుంటే మరీ మంచిది.

ఫైబర్‌ ఎక్కువగా లభించే ఆహారపదార్థాలను తీసుకోవాలి. ఫలితంగా మలవిసర్జన సాఫీగా జరుగుతుంది.

రోజూ అరగంటపాటు వాకింగ్‌ చేయాలి. శరీరంలో ఉన్న హానికరపదార్థాలు బయటకు వెళ్లాలంటే నడక తప్పనిసరి. రోజూ కాసేపు యోగాసనాలు వేయండి.

రోజూ గోరు వెచ్చని నీళ్లు తాగితే లింఫ్‌ వ్యవస్థ డిటాక్సిఫై అవుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జీర్ణశక్తి పెరుగుతుంది. అనారోగ్యం దరిచేరకుండా ఉంటుంది.

Updated Date - 2021-05-19T16:29:35+05:30 IST