అత్యవసర సేవల కోసం..!

ABN , First Publish Date - 2021-07-24T05:09:50+05:30 IST

అత్యవసర సమయాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 108 వాహనాలు సకాలంలో రాకపోవడంతో ఇబ్బం దులు తలెత్తుతున్న విషయాన్ని ఆ గ్రామ యువకులు గుర్తించారు.. ఒక వాహనాన్ని తామే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.. అనుకున్నదే తడవుగా రూ.2.50 లక్షలతో ఓ వాహనాన్ని కొనుగోలు చేసి దానిలో అంబులెన్స్‌కు అవసరమైన పరికరాలు ఏర్పాటు చేసి స్ఫూర్తిగా నిలిచారు జలగలింగుపురం యువత..

అత్యవసర సేవల కోసం..!
కొనుగోలు చేసిన అంబులెన్స్‌తో జలగలింగుపురం యువత

 అంబులెన్స్‌ వాహనం కొనుగోలుచేసి..

స్ఫూర్తిగా నిలిచిన జలగలింగుపురం యువత

మెళియాపుట్టి, జూలై 23: అత్యవసర సమయాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 108 వాహనాలు సకాలంలో రాకపోవడంతో ఇబ్బం దులు తలెత్తుతున్న విషయాన్ని ఆ గ్రామ యువకులు గుర్తించారు.. ఒక వాహనాన్ని తామే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.. అనుకున్నదే తడవుగా రూ.2.50 లక్షలతో ఓ వాహనాన్ని కొనుగోలు చేసి దానిలో అంబులెన్స్‌కు అవసరమైన పరికరాలు ఏర్పాటు చేసి స్ఫూర్తిగా నిలిచారు జలగలింగుపురం యువత.. రాత్రి సమయాల్లో 108 వాహనం రావడం ఆలస్యం కావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈ నేపథ్యంలో తాము ఆరు నెలల పాటు తల్లిదండ్రులు ఇచ్చిన ఖర్చులను ఒకచోట ఉంచి అం బులెన్స్‌ను కొనుగోలు చేశామని యువకులు పేర్కొన్నారు. దీనిని శుక్రవారం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రారంభించి యువతను అభినందించారు. 

 


 

Updated Date - 2021-07-24T05:09:50+05:30 IST