ఉపాధి కూలీలకు 100 రోజులు పని కల్పించాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-03-07T04:22:39+05:30 IST

ఉపాధిహామీ పనుల్లో కూలీలకు 100రోజులు పని కల్పించా లని కలెక్టర్‌ యాస్మిన్‌ బాష అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఎంపీడీవో, ఉపాధిహామీ సిబ్బందితో కలెక్టర్‌ మాట్లాడారు.

ఉపాధి కూలీలకు  100 రోజులు పని కల్పించాలి : కలెక్టర్‌
టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌

వనపర్తి అర్బన్‌, మార్చి 6: ఉపాధిహామీ పనుల్లో కూలీలకు 100రోజులు పని కల్పించా లని  కలెక్టర్‌ యాస్మిన్‌ బాష అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఎంపీడీవో, ఉపాధిహామీ సిబ్బందితో కలెక్టర్‌ మాట్లాడారు. గ్రామాల్లో అవస రం ఉన్న పనిని బట్టి కూలీలకు వందరోజుల పనికల్పించాలని సూచించారు. ప్రతి పనిని జియో ట్యాగింగ్‌ చేయాలన్నారు. జాబ్‌ కార్డులను ఎప్పటికప్పుడు పంచాయతీ కార్యదర్శి ద్వారా మార్పులు చేయించాలన్నారు. నర్సరీలలో మొక్కలు ఎండిపోకుండా చూడాలన్నా రు. కార్యక్రమంలో సీఈవో, డీఆర్‌డీవో, డిప్యూటీ ఈవో, ఏపీడీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-07T04:22:39+05:30 IST