మంచి నిద్రకోసం ఇలా చేయండి!

ABN , First Publish Date - 2021-07-17T17:33:48+05:30 IST

రాత్రి మంచి నిద్ర పోతేనే మరుసటి రోజు పనులన్నీ హుషారుగా చేసుకోగలుగుతారు. అయితే కొంతమందికి బెడ్‌పైకి చేరుకున్నాక చాలా సమయం వరకు నిద్రపట్టదు. అలాంటి వారు ఇలా చేస్తే త్వరగా నిద్రపోవచ్చని అంటున్నారు నిపుణులు.

మంచి నిద్రకోసం ఇలా చేయండి!

ఆంధ్రజ్యోతి(17-07-2021)

రాత్రి మంచి నిద్ర పోతేనే మరుసటి రోజు పనులన్నీ హుషారుగా చేసుకోగలుగుతారు. అయితే కొంతమందికి బెడ్‌పైకి చేరుకున్నాక చాలా సమయం వరకు నిద్రపట్టదు. అలాంటి వారు ఇలా చేస్తే త్వరగా నిద్రపోవచ్చని అంటున్నారు నిపుణులు.


అలసిపోయినట్టు అనిపించగానే నిద్రకు ఉపక్రమించాలి. ఒకవేళ నిద్ర రాకపోతే ఆ సమయాన్ని ఇతర పనులకు వెచ్చించండి. ఆ సమయంలో ఒక పుస్తకం చదవొచ్చు. బాల్కనీలో పచార్లు చేయవచ్చు. స్వచ్ఛమైన గాలి, నడక నిద్ర వచ్చేలా చేసేవే. 


నిద్రకు ఉపక్రమించే ముందు పొట్ట నిండుగా తినకూడదు. భోజనానికి, పడుకోవడానికి మధ్య సమయం ఉండాలి. రాత్రివేళ కార్బోహైడ్రేట్స్‌ కన్నా ప్రొటీన్స్‌ ఎక్కువగా లభించే ఫుడ్‌ను తీసుకోవాలి. పడుకునే ముందు పాలు తాగడం మంచి అలవాటు. పాలల్లో అమైనోయాసిడ్స్‌ ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఇవి నిద్రను ప్రేరేపించే రసాయనాలను ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి.


రాత్రివేళ కెఫెన్‌ ఉండే పానీయాలకు దూరంగా ఉండాలి. ఇవి జీవక్రియల వేగాన్ని పెంచి నిద్రను దూరం చేస్తాయి. 


బెడ్‌పైకి చేరే ముందు గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయాలి. అరోమా ఆయిల్స్‌ను ఉపయోగించడం వల్ల కూడా మంచి రిలాక్సేషన్‌ వస్తుంది. ఫలితంగా చక్కటి నిద్ర పడుతుంది.


మంచి నిద్ర పట్టాలంటే సౌకర్యవంతమైన బెడ్‌ కూడా ఉండాలి. మరీ మెత్తగా లేదీ మరీ గట్టిగా ఉండకూడదు. 


బెడ్‌రూమ్‌లోకి బయటి శబ్దాలు వినిపించకుండా చూసుకోవాలి. బెడ్‌పైకి చేరాక స్మార్ట్‌ఫోన్‌ చూడకూడదు. ఫోన్‌ స్ర్కీన్‌ నుంచి బ్లూలైట్‌ నిద్రను దూరం చేస్తుంది.


Updated Date - 2021-07-17T17:33:48+05:30 IST