పాదయాత్రకు పోదాం పదండి!

ABN , First Publish Date - 2021-11-16T06:04:16+05:30 IST

జిల్లాలో అమరావతి రైతుల మహాపాదయాత్ర పదోరోజైన సోమవారం విజయవంతంగా ముందుకెళ్లింది. గత రాత్రి బస చేసిన ఎం. నిడమలూరు నుంచి విక్కిరాలపేట వరకు నాలుగు మండలాలు కలుపుతూ సుమారు 14 కి.మీ యాత్ర సాగింది. రైతులు, రైతు కూలీలు, మహిళలు, వేలాది మంది వారికి ఘనస్వాగతం పలుకుతూ అనుసరిస్తూ పాల్గొనగా యువతరం భాగస్వామ్యం అధికంగా కనిపించింది

పాదయాత్రకు   పోదాం పదండి!
కె. ఉప్పలపాడులో సాగుతున్న మహాపాదయాత్ర

ఊరూరా తరలివస్తున్న ప్రజలు 

వానలోనూ ఉత్సాహంగా సాగిన యాత్ర

దారి పొడవునా జై అమరావతి నినాదం

పదో రోజు 14 కి.మీ సాగిన యాత్ర

మద్దతుగా పాల్గొన్న ఎమ్మెల్యేలు స్వామి, ఏలూరి

నేడు కందుకూరుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ 

ఒంగోలు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) :

అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్ర అఖండ జనసందోహం మధ్య విజయవంతంగా సాగుతోంది. మేము సైతం అంటూ ఊరూరా ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. అన్నివర్గాల వారు మమేకమై పాదయాత్రలో భాగస్వామ్యమవుతున్నారు. యాత్ర బృందంతో కలిసి కిలోమీటర్ల దూరం నడుస్తున్నారు. జయహో అమరావతి అంటూ నినదిస్తున్నారు. సోమవారం యాత్ర నాలుగు మండలాల్లోని 14 కి.మీ సాగింది. పూర్తిగా గ్రామీణప్రాంతంలోనే నిర్వహించగా ఆ మార్గంలోని గ్రామాలతోపాటు పరిసర ప్రాంతాలకు చెందిన అనేక మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, ఇత ర ఉద్యోగాలు, వృత్తులలో ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు స్వగ్రామాలకు వచ్చి పూల జల్లులు కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. 


 జిల్లాలో అమరావతి రైతుల మహాపాదయాత్ర పదోరోజైన సోమవారం విజయవంతంగా ముందుకెళ్లింది. గత రాత్రి బస చేసిన ఎం. నిడమలూరు నుంచి విక్కిరాలపేట వరకు నాలుగు మండలాలు కలుపుతూ సుమారు 14 కి.మీ యాత్ర సాగింది.  రైతులు, రైతు కూలీలు, మహిళలు, వేలాది మంది వారికి ఘనస్వాగతం పలుకుతూ అనుసరిస్తూ పాల్గొనగా యువతరం భాగస్వామ్యం అధికంగా కనిపించింది. ఆయా గ్రామాల్లో పెద్ద సంఖ్యలో యువతీ, యువకులు యాత్ర బృందానికి ఘనంగా స్వాగతం పలకడంతోపాటు వారితో కలిసి అడుగులో అడుగు వేస్తూ జై అమరావతి అని నినదిస్తూ ముందుకు సాగారు. 


తరలివచ్చిన పల్లె ప్రజలు 

ఎం.నిడమలూరులోని శిబిరం వద్ద జేఏసీ నేతలతో కలిసి కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ స్వామి, యువనేత దామచర్ల సత్య పూజలు చేసి యాత్రను ప్రారంభించగా నిడమానూరు,  కె.ఉప్పలపాడు, చిరికూరపాడు మీదుగా విక్కరాలపేట వరకూ పాదయాత్ర కొనసాగింది. వారిరువూ ఆద్యంతం పాదయాత్ర బృందంతో కలిసి నడవగా  గ్రామ, గ్రామాన పెద్దసంఖ్యలో ప్రజానీకం యాత్ర బృందానికి స్వాగతం పలకడంతోపాటు పూల జల్లులు కురిపిస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. యాత్రం మొత్తం పల్లె ప్రాంతంలోనే సాగగా ఊరూరా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఉప్పలపాడు వద్ద మాజీ ఎమ్మెల్యే గుండపనేని అచ్యుత్‌కుమార్‌ నేతృత్వంలో గ్రామస్థులు ఎదురేగి స్వాగతం పలికారు. చిరికూరపాడు వద్ద పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, వ్యాపారవేత్త దామచర్ల పూర్ణచంద్రరావు యాత్ర బృందాన్ని కలిసి సంఘీభావం తెలిపారు. విక్కిరాలపేట బ్రిడ్జి వద్ద కందుకూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ దివి శివరాం, యువనేత ఇంటూరి రాజేష్‌ నేతృత్వంలో కందుకూరు నియోజకవర్గ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. రాత్రికి వికి ్కరాలపేటలో పాదయాత్ర బృందం బసచేసింది. సుమారు 14 కి.మీ. నాలుగు ప్రధాన గ్రామాల్లో గుండా యాత్ర సాగగా నాలుగు గ్రామాలు,  నాలుగు మండలాల్లోనివి కావడంతో ఆపరిసరాల్లోని దాదాపు 50నుంచి 60 గ్రామాల ప్రజానీకం ఈ యాత్రలో వేలాదిగా పాల్గొన్నారు.


ఉత్సాహ వాతావరణంలో యాత్ర 

దారిపొడవునా మేళతాళాలు, డప్పు నృత్యాలు, విచిత్ర వేషధారణలతో ఉత్సాహవాతావరణంలో  యాత్ర సాగింది. ప్రత్యేకించి కొండపి నియోజకవర్గ పరిధిలోని అనేక గ్రామాలకు చెందిన యువతీ, యువకులు వారిలోనూ ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతరత్రా రంగాల్లో ఉంటున్నవారు భారీగా గ్రామాలకు చేరి పాదయాత్ర బృందానికి సంఘీభావం తెలపడంతోపాటు వారితో కలిసి కిలోమీటర్ల దూరం నడవటం కనిపించింది.  


స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి అందజేత 

యాత్ర బృందానికి ఆర్థికంగా సహకరించేందుకు అనేక గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా తమ గ్రామాల్లో సేకరించిన లక్షలాది రూపాయాలను ఈ సందర్భంగా జేఏసీ నేతలకు అందించారు. కొండపి నియోజకవర్గ పరిధిలో ఆది, సోమవారాల్లో సుమారు రూ.45 లక్షల మేరకు అందజేశారు. ఇదిలా ఉండగా మంగళవారం విక్కిరాలపేట నుంచి కందుకూరు వరకు యాత్ర సాగనుంది. కాగా  అమరావతి రైతుల ఉద్యమం  ప్రారంభించి మంగళవారానికి 700 రోజులు పూర్తవుతోంది. ఈ సందర్భంగా సాయంత్రం కందుకూరులో జరిగే యాత్రలో సీపీఐ రామకృష్ణ పాల్గొననున్నారు. 




Updated Date - 2021-11-16T06:04:16+05:30 IST