మీది ఆయిల్‌ స్కిన్‌ అయితే..!

ABN , First Publish Date - 2021-06-10T18:21:07+05:30 IST

చర్మం మృదువుగా ఉండటం కోసం సెబాసియస్‌ గ్రంథులు సెబమ్‌ను ఉత్పత్తి చేస్తాయి. కానీ సెబమ్‌ అధికంగా ఉత్పత్తి అయినప్పుడు చర్మం జిగటగా మారుతుంది. మొటిమలు

మీది ఆయిల్‌ స్కిన్‌ అయితే..!

చర్మం మృదువుగా ఉండటం కోసం సెబాసియస్‌ గ్రంథులు సెబమ్‌ను ఉత్పత్తి చేస్తాయి. కానీ సెబమ్‌ అధికంగా ఉత్పత్తి అయినప్పుడు చర్మం జిగటగా మారుతుంది. మొటిమలు వంటి సమస్యలు వస్తాయి. వాతావరణం తేమగా ఉన్నప్పుడు ఆయిల్‌ స్కిన్‌ మరింత ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే..


రోజులో రెండు లేదా మూడుసార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం శుభ్రంగా ఉంటుంది. అలాగే మేకప్‌ వేసుకునే ముందు ప్రైమర్‌ను ఉపయోగించాలి. 

ప్రతిరోజూ ఆల్కహాల్‌ ఫ్రీ టోనర్‌ను మాత్రమే వాడాలి. ఇది అదనపు ఆయిల్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.

వారంలో ఒకరోజు పీల్‌ మాస్క్‌ వేసుకోవాలి. చార్‌కోల్‌ ఉన్న ఫేస్‌ మాస్క్‌ ఉపయోగిస్తే మరీ మంచిది.

బయటకు వెళుతున్నట్లయితే తప్పనిసరిగా సన్‌స్ర్కీన్‌ లోషన్‌ ఉపయోగించాలి. జింక్‌ లేదా టైటానియం డైఆక్సైడ్‌ ఉన్న మినరల్‌ బేస్డ్‌ సన్‌స్ర్కీన్‌ ఉపయోగిస్తే చర్మం నుంచి అదనపు ఆయిల్‌ను గ్రహిస్తుంది.

మేక్‌పతో ఎప్పుడూ పడుకోకూడదు. దీనివల్ల చర్మరంధ్రాలు మూసుకుపోయి ఇతర సమస్యలు మొదలవుతాయి.

వారంలో రెండు మూడుసార్లు ఫేస్‌మాస్క్‌ అప్లై చేసుకోవాలి. చందనం, ముల్తానా మట్టి, బెంటోనైట్‌ క్లే, కయోలిన్‌ ఉన్న మాస్క్‌ ఉపయోగిస్తే చర్మంపై ఉన్న అదనపు ఆయిల్‌ను గ్రహిస్తాయి.


Updated Date - 2021-06-10T18:21:07+05:30 IST