ఊరి ప్రజల కోసం..!

ABN , First Publish Date - 2021-05-19T05:30:00+05:30 IST

అమెరికాలోని కాసే పట్టణంలోని ఒక వీధిలోకి వెళితే పెద్ద కుర్చీ కనిపిస్తుంది. మరో వీధిలో తాటిచెట్టంత పెన్సిల్‌ దర్శనమిస్తుంది. కొలబద్ద, వుడెన్‌ షూస్‌...

ఊరి ప్రజల కోసం..!

అమెరికాలోని కాసే పట్టణంలోని ఒక వీధిలోకి వెళితే పెద్ద కుర్చీ కనిపిస్తుంది. మరో వీధిలో తాటిచెట్టంత పెన్సిల్‌ దర్శనమిస్తుంది. కొలబద్ద, వుడెన్‌ షూస్‌... ఇలా ఇంట్లో కనిపించే రకరకాల వస్తువులు వీధుల్లో పెద్దగా దర్శనమిస్తాయి. ఇంతకీ ఆ వస్తువులను ఎవరు తయారుచేశారు? ఎందుకు వాటిని పెట్టాల్సి వచ్చింది? ఆ విశేషాలు ఇవి.


ఇంట్లో కనిపించే వస్తువులు నిలువెత్తు ఆకారాల్లో వీధుల్లో కనిపించడం వెనక ఒక కారణం ఉంది. స్థానికుడైన బొలిస్‌ అనే వ్యక్తి వ్యాపారంలో బాగా డబ్బు గడించాడు. అంచెలంచెలుగా వ్యాపారాన్ని విస్తరించాడు. అయితే ఇతర వ్యాపారాలు చేసుకుంటూ గ్రామంలో నివసించే చాలామంది నష్టాలు రావడంతో ఊరు వదిలి వెళ్లడానికి సిద్ధమయ్యారు. కొద్ది జనాభా ఉన్న ఆ గ్రామం నుంచి వాళ్లు కూడా వెళ్లిపోతే ఊరు నిర్మానుష్యమవుతుందని బొలిస్‌ అనుకున్నాడు. వాళ్ల వ్యాపారాలు బాగా నడవాలంటే పర్యాటకం పెరగాలని అనుకున్నాడు. అనుకున్నది తడవుగా వస్తువులను పెద్ద పెద్ద ఆకారాల్లో తయారుచేసిపెట్టాడు. వాటిని చూడటానికి పర్యాటకులు రావడం మొదలయింది. దాంతో మళ్లీ వ్యాపారాలు ఊపందుకున్నాయి.  

Updated Date - 2021-05-19T05:30:00+05:30 IST