మోదీ సభ విజయవంతానికి..

ABN , First Publish Date - 2022-07-02T06:23:06+05:30 IST

మోదీ సభ విజయవంతానికి..

మోదీ సభ విజయవంతానికి..
కొత్తగూడెంలో పూజలు చేస్తున్న ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు థరమ్‌ లాల్‌ కౌశిక్‌, జిల్లా నాయకులు

ఉమ్మడి జిల్లాలో ‘ఇన్‌చార్జ్‌’ల విస్తృత పర్యటన

నియోజకవర్గాల వారీగా సమావేశాలు 

ఇరు జిల్లాల నుంచి రెండు రైళ్లు, వందల వాహనాల్లో తరలనున్న శ్రేణులు

ఖమ్మం (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) /లక్ష్మీదేవిపల్లి, జూలై 1: హైదరాబాద్‌లో ఆదివారం జరిగే ప్రధాని నరేంద్రమోదీ విజయసంకల్ప సభ విజయవంతానికి బీజేపీ శ్రేణులు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా నియమితులైన ఇనచార్జ్‌లు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లా నుంచి విజయసంకల్పసభకు అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలాలని పిలుపునిస్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మం, కొత్తగూడెం నుంచి రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడంతో పాటు.. వందలాది వాహనాల్లో రాష్ట్ర రాజధానికి తరలేందుకు సిద్ధమవుతున్నారు. పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మంరూరల్‌ మండలంలోని ఏదులాపురంలో ఎంపీ లక్ష్మీకాంత బాజ్‌పాయ్‌ కిసానమోర్చా సమ్మేళనంలో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ రైతు వ్యతిరేక ప్రభుత్వమని, కేంద్ర ప్రభుత్వం రైతుసంక్షేమంకోసం పనిచేస్తుంంటే తెలంగాణలో రైతులకు ఆ పథకాలు దక్కకుండా చేస్తోందని మండిపడ్డారు. రైతు ఆత్మహత్యలకు టీఆర్‌ఎస్‌ విధానాలే కారణమని ఆరోపించారు. ఈసమావేశంలో బీజేపీ కిసానమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ పాల్గొన్నారు. జిల్లా నాయకులు మాట్లాడుతూ ఆదివారం ఉదయం ఖమ్మం నుంచి ప్రత్యేక రైలు బయల్దేరుతుందని తెలిపారు. ఖమ్మంలో నియోజకవర్గస్థాయి బూతకమిటీ సమావేశం ఓప్రైవేటు హోటల్‌లో జరగ్గా.. నియోజకవర్గ పరిశీలకుడుగా వచ్చిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గోపాలకృష్ణ అగర్వాల్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ప్రజలకోసం అనేక సంక్షేమపథకాలు ప్రవేశపెడుతుంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆపథకాలు తమవిగా ప్రచారంచేసుకుంటుందన్నారు. మోదీ సభకు జిల్లానుంచి భారీగా తరలిరావాలని కోరారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగే మోదీ విజయ్‌ సంకల్ప్‌ సభకు జిల్లా నుంచి భారీగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట బీజేపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, నియోజకవర్గ ఇనచార్జి ఉప్పల శారద, కార్పొరేటర్‌ దొంగల సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు విద్యాసాగర్‌రావు ఉన్నారు. మధిర నియోజకవర్గం ఎర్రుపాలెంలో ఎంపీ సంధ్యారే కార్యకర్తల సమావేశంలో మాట్లాడరు. సత్తుపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలో బీజేపీ అధికారప్రతినిధి ముకుత మణి గిరిజనమోర్చా సదస్సు నిర్వహిచగా.. నియోజకవర్గ నాయకులు నంబూరి రామలింగేశ్వరరావు కిసానమోర్చ నాయకులు ఉడతనేని అప్పారావు పాల్గొన్నారు.  వైరా నియోజకవర్గం కారేపల్లి మండలంలో ఎంపీ ప్రమీలాబెన బెహర కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. కోరారు. ఇక మోదీ సభను విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఛత్తీ్‌సగఢ్‌ నాయకులు థరమ్‌ లాల్‌ కౌశిక్‌,  భద్రాద్రి జిల్లా బీజేపీ అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ (చిన్ని) భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని విజయవిఘ్నేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనతరం లక్ష్మీదేవిపల్లిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. మోదీ సభకోసం ప్రత్యేక రైలును ఏర్పాటు చేశామని, ఈ రైలు మణుగూరు నుంచి ఉదయం 7గంటలకు ప్రారంభమై కొత్తగూడెం మీదుగా హైదరాబాద్‌ చేరుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు, టోబాకో బోర్డు చైర్మన బైరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, నాయకులు నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్లవల్లి శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు. ఇల్లెందు నియోజకవర్గం  ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో ఛత్తీ్‌సగఢ్‌ మాజీ మంత్రి లత ఉసెండి కార్యకర్తలతో సమావేశమమ్యారు. మణుగూరు  నియోజకవర్గంలో రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధి వీసాల వెంకటేశ్వర్లు సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ బలోపేతంతోపాటు ప్రధాని మోదీ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 



Updated Date - 2022-07-02T06:23:06+05:30 IST