మహానాడుకు వెళ్లేవారికి ఏలూరి క్యాంపు కార్యాలయంలో బస

ABN , First Publish Date - 2022-05-26T05:10:39+05:30 IST

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ఈ నెల 27, 28 వతేదీలలో ఒంగోలులో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమానికి తరలివెళ్లే పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మండల పరిధిలోని ఇసుకదర్శి ఏలూరి క్యాంపు కార్యాలయంలో విశ్రాంతి ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు, వైజాగ్‌, రాజమండి, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, ఏలూరు, మాచర్ల విజయవాడ తదితర సుదూర ప్రాంతాల నుంచి కార్యకర్తలు ప్రైవేటు వాహనాలలో మహానాడుకు తరలివస్తున్నారు.

మహానాడుకు వెళ్లేవారికి ఏలూరి క్యాంపు కార్యాలయంలో బస
ఇసుకదర్శి క్యాంపు కార్యాలయంలో నేతలకు సూచనలిస్తున్న ఎమ్మెల్యే ఏలూరి

28 న సాయంత్రం మహానాడు నుంచి ఇంటికి వెళ్లే వారికి భోజన ఏర్పాట్లు

మార్టూరు, మే 25: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ఈ నెల 27, 28 వతేదీలలో ఒంగోలులో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమానికి తరలివెళ్లే పార్టీ నాయకులకు,  కార్యకర్తలకు  మండల పరిధిలోని ఇసుకదర్శి ఏలూరి క్యాంపు కార్యాలయంలో విశ్రాంతి ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు, వైజాగ్‌, రాజమండి, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, ఏలూరు, మాచర్ల విజయవాడ తదితర సుదూర ప్రాంతాల నుంచి కార్యకర్తలు ప్రైవేటు వాహనాలలో మహానాడుకు తరలివస్తున్నారు. అయితే వారందరికి ఒంగోలులో బస ఏర్పాట్లు చేయడం చాలా కష్టతరమైన పని కావడంతో టీడీపీ బాపట్ల  పార్లమెంటు అధ్యక్షుడు, ఎంఎల్‌ఏ ఏలూరి సాంబశివరావు క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహానాడు కోసం వచ్చేవారు, అవసరమైన వారు గురువారం సాయంత్రం నుంచి క్యాంపు కార్యాలయంలో విశ్రాంతి తీసుకొని, శుక్రవారం ఉదయం ఒంగోలు లో మహానాడుకు తరలివెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. వారందరికి భోజనం, టిఫిన్‌, బయో టాయ్‌లెట్లు, విశ్రాంతి తీసుకోవడానికి పరుపులు ఏర్పాట్లు చేశారు. అంతేగాకుండా వారి వాహనాలను పార్కింగ్‌ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా క్యాంపు కార్యాలయం వెనుక 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అందుకు సంబంధించి దాదాపుగా 50 మంది వ్యక్తులను కేటాయించి, వచ్చిన వారికి ఏర్పాట్లు చేయడానికి, అందరికి అన్ని సౌకర్యాలు అందేవిధంగా ప్రణాళికను తయారుచేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం నుంచి క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

28 న తిరిగి వెళ్లే కార్యకర్తలకు భోజనాలు

మహానాడులో రెండు రోజుల కార్యక్రమాలను ముగించుకొని శనివారం తిరుగు ప్రయాణమై ఒంగోలు వైపు నుంచి గుంటూరు జిల్లా వైపు వెళ్లే పార్టీ నాయకులకు, కార్యకర్తలకు క్యాంపు కార్యాలయం వారు భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. క్యాంపు కార్యాలయానికి ఎదురుగా గుంటూరు వైపు రోడ్డు పక్కన భోజనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారి వాహనాలు రోడ్డు పై ఉంచకుండా ప్రత్యేకంగా పార్కింగ్‌ జోన్‌ ను ఏర్పాటుచేశారు.  ఈ కార్యక్రమాలను కామేపల్లి హరిబాబు, శివరాత్రి శ్రీను,షేక్‌ ఫరూక్‌, అడుసుమల్లి నాగ శ్రీహర్ష, శానంపూడి చిరంజీవి, అడుసుమల్లి శ్రీను, మిన్నెకంటి రవి, శానంపూడి చైతన్య తదితరులు పర్యవేక్షిస్తున్నారు.


 అభిమానులు, కార్యకర్తలు తరలిరావాలి

  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఒంగోలు రానున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీగా తరలి రావాలని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షులు ఏలూరి సాంబశివరావు బుధవారం ఒక ప్రకటనలో పిలుపు నిచ్చారు. ఉదయం 10 గంటలకు ఉమ్మడి ప్రకాశం జిల్లా  సరిహద్దు వద్ద ఏలూరి ఆధ్వర్యంలో భారీ బైక్‌ర్యాలీ నిర్వహించనున్నారు. అధిక సంఖ్యలో బాపట్ల పార్లమెంట్‌ పరిఽధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తెలగుదేశం పార్టీ శ్రేణులు తరలి రావాలని కోరారు. 

Updated Date - 2022-05-26T05:10:39+05:30 IST