కొలచిన వారికి కొంగు బంగారం లింగంపల్లి ఎల్లమ్మ

ABN , First Publish Date - 2022-02-07T04:23:05+05:30 IST

కొలిచిన వారికి కొంగు బంగారంగా లింగంపల్లి ఎల్లమ్మ దేవత విరాజిల్లుతోంది. గ్రామీణుల ఆరాధ్య దేవతైన లింగంపల్లి ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ప్రతీ సంవత్సరం వలే ఈ సంవత్సరం కూడా నిర్వహిం చేందుకు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు.

కొలచిన వారికి కొంగు బంగారం లింగంపల్లి ఎల్లమ్మ
ఎల్లమ్మ దేవత

- రేపు పెద్ద బోనంకుండ ఉత్సవాలు 

- ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు

- ఐదు వారాల పాటు కొనసాగనున్న జాతర

నారాయణపేట/రూరల్‌, ఫిబ్రవరి 6 : కొలిచిన వారికి కొంగు బంగారంగా లింగంపల్లి ఎల్లమ్మ దేవత విరాజిల్లుతోంది. గ్రామీణుల ఆరాధ్య దేవతైన లింగంపల్లి ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ప్రతీ సంవత్సరం వలే ఈ సంవత్సరం కూడా నిర్వహిం చేందుకు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. జాతరలో ప్రధాన ఘట్టం ఈనెల 8న మంగళవారం పెద్ద బోనంకుండ ఊరేగింపును విశేషంగా నిర్వహించడం ఇక్కడి భక్తుల ఆనవాయితి. నారాయణపేట మండలం లింగంపల్లి గ్రామంలో వెలసిన ఎల్లమ్మ దేవతను పూజించేందుకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఐదు వారాలపాటు కొనసాగే ఉత్సవాల్లో భాగంగా పెద్ద బోనంకుండ ఉత్సవాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ముఖ్యంగా అమ్మవారి భక్తురాలైన సాయమ్మ నోటికి వేసే తాళం దృశ్యం చూసేందుకు భక్తులు పోటీ పడతారు. గవ్వల దండను సాయమ్మ మెడలో వేసి ము ఖా నికి బొట్లు పెట్టి నోటికి తాళం వేసి దేవాలయం చుట్టూ ప్రదక్షణ చేయిస్తారు. పెద్ద బోనం కుండ తిరిగే సమయంలోనే చిన్న పిల్లలకు బండారు (పసుపు) వేస్తే మళ్లీ ఏడాది వరకు ఏ విధమైన వ్యాధులు వ్యాపించవనే భక్తుల నమ్మకం. ఈనెల 7న ఎల్లమ్మ దేవత ఊరేగింపు, 8న పెద్ద బోనం కుండ అలంకరణ పూజ, 9న పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఉత్సవాల సందర్భంగా నారాయణపేట నుంచి లింగంపల్లి వరకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 

కోళ్లకు భలే డిమాండ్‌ 

ఎల్లమ్మ జాతర సందర్భంగా ప్రతి ఇంటివారు అమ్మవారికి బోనం కుండతో పాటు కోడిని నైవేద్యం కింద సమర్పించాల్సి ఉన్నందున గ్రామీణ ప్రాంతాల్లో కోళ్లకు భలే డిమాండ్‌ నెలకొంది. ఈ ఉత్సవాలకు పల్లె వాసులు పెంచుకున్న నాటు కోళ్లనే బలిచ్చి మొక్కుబడులు చెల్లిస్తుండగా నాటు కోళ్ల కొరత ఉండడంతో మార్కెట్‌లో లభించే పౌలీ్ట్రకోళ్లు కొనుగోలు చేస్తున్నారు. 




Updated Date - 2022-02-07T04:23:05+05:30 IST