మహిళా పారిశ్రామికవేత్తలకు రూ.1,000 కోట్ల రుణాలు

ABN , First Publish Date - 2022-10-04T09:12:18+05:30 IST

మహిళ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.1,000 కోట్లకు పైగా రుణాలను పంపిణీ చేసింది.

మహిళా పారిశ్రామికవేత్తలకు రూ.1,000 కోట్ల రుణాలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మహిళ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.1,000 కోట్లకు పైగా రుణాలను పంపిణీ చేసింది. ‘యూనియన్‌ నారీ శక్తి’ పథకం కింద ఈ రుణాలు ఇచ్చినట్లు బ్యాంకు వెల్లడించింది. మహిళ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవసరాలను బట్టి ఈ పథకం కింద బ్యాంకు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల రుణాలను మంజూరు చేస్తోంది. దేశ వ్యాప్తంగా 10 వేల మందికి పైగా మహిళలకు ‘యూనియన్‌ నారీ శక్తి’ కింద రుణాలు ఇచ్చినట్లు బ్యాంక్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సీఎం మినోచి తెలిపారు.

Updated Date - 2022-10-04T09:12:18+05:30 IST