ఎన్నాళ్లకెన్నాళ్లకు..

ABN , First Publish Date - 2022-05-22T06:32:21+05:30 IST

కరోనా పుణ్యమా అంటూ మద్యం ప్రియుల పై పోలీసులు ఎక్కడా తనిఖీలు చేయలేదు. గతంలో డ్రంకెన డ్రైవ్‌ కేసులు నమోదు చేసేవారు.

ఎన్నాళ్లకెన్నాళ్లకు..
డ్రంకెన డ్రైవ్‌ పరీక్ష చేస్తున్న పోలీసులు

బ్రీత అనలైజర్‌కు దుమ్ము దులిపిన పోలీసులు 


హిందూపురం టౌన, మే 21: కరోనా పుణ్యమా అంటూ మద్యం ప్రియుల పై పోలీసులు ఎక్కడా తనిఖీలు చేయలేదు. గతంలో డ్రంకెన డ్రైవ్‌ కేసులు నమోదు చేసేవారు. సాయంత్రం పూట పట్టణ ప్రధాన సర్కిళ్లతో పాటు శివా రు ప్రాంతాల్లో పోలీసులు వాహనాలు ఆపి, బ్రీతఅనలైజర్‌తో తనిఖీచేసేవారు. మద్యం తాగి ఉంటే కేసు నమోదుచేసి, కొన్ని సందర్భాల్లో జైలుశిక్ష కూడా వి ధించారు. అయితే రెండేళ్లుగా కరోనా కారణంగా వీటికి స్వస్తి పలికారు. దీంతో బ్రీతఅనలైజర్‌ యంత్రాలు దుమ్ముపట్టిపోయాయి. ఇటీవల హిందూపురానికి డీఐజీ రవిప్రకాశ వచ్చారు. ఈసందర్భంగా డీఐజీని కలిసిన ఆంధ్రజ్యోతి డ్రం కెన డ్రైవ్‌ను ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీంతో వెంటనే డ్రంకెన డ్రైవ్‌ తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో శుక్రవారం నుంచి పోలీసులు పట్టణంలో డ్రంకెన డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు. మొదటిరోజే పది కేసులు న మోదు చేసినట్లు వనటౌన సీఐ ఇస్మాయిల్‌, ఎంవీఐ దీప్తి తెలిపారు. అయితే డ్రంకెన డ్రైవ్‌ తనిఖీలు ఎన్నాళ్లకెన్నాళ్లకు చేపట్టారని స్థానికులు చర్చించు కోవడం కనిపించింది.


Updated Date - 2022-05-22T06:32:21+05:30 IST