నియోజకవర్గ అభివృద్ధికి ‘మీ కోసం’

Jun 17 2021 @ 00:12AM
కల్యాణలక్ష్మి చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే

మెదక్‌, జూన్‌ 16 : నియోజకవర్గ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ‘మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవెందర్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని తెలిపారు. నియోజకవర్గంలోని 54 మంది ఫోన్‌ ద్వారా సమస్యలను విన్నవించగా, 133 మంది లిఖిత పూర్వకంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. మెదక్‌లో 64 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మెదక్‌ ఆర్డీవో సాయిరాం,  తహసీల్దార్‌ రవికుమార్‌, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Follow Us on: