నక్కా లావణ్య మృతదేహం
మైలవరం, మే 28: వరుసకు అన్నను ప్రేమించాననే మన స్థాపంతో నక్కా లావణ్య (24) బలవన్మరణానికి గురైంది. మైలవరం ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు... ఇదే గ్రామ వాసి చౌడం సిద్దయ్యతో నాలుగేళ్ల కిందట పరిచయం ఏర్పడిం ది. ఈపరిచయం ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలో 26న ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయి 27న ఇంటికి చేరుకున్నారు. దీంతో గ్రామ పెద్దలు పంచాయతీ చేసి సిద్దయ్య నీకు అన్న వరుస అవుతాడని ఎలా ప్రేమించావని లావణ్యకు వివరించి మందలించారు.
అనంతరం ఇద్దరినీ ఎవరి ఇంటికి వారిని పం పించి వేశారు. దీంతో వరుసకు అన్నను ప్రేమించి తప్పు చేశానని మనస్ధాపం చెంది శనివారం తెల్లవారుఝామున ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న లావణ్య తల్లి లక్ష్మీదేవి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మైలవరం ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.