రికార్డు స్థాయికి విదేశీ మారక నిల్వలు

ABN , First Publish Date - 2021-06-12T06:01:02+05:30 IST

కరోనా కష్ట కాలంలోనూ భారత విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్‌) నిల్వలు మరో ఆల్‌టైమ్‌

రికార్డు స్థాయికి విదేశీ మారక నిల్వలు

జూన్‌ 4 నాటికి 60,500 కోట్ల డాలర్లకు..


ముంబై: కరోనా కష్ట కాలంలోనూ భారత విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్‌) నిల్వలు మరో ఆల్‌టైమ్‌ హై స్థాయికి చేరా యి. ప్రస్తుతం ఈ నిల్వలు తొలిసారిగా 60,000 కోట్ల డాలర్ల మార్కును దాటిపోయాయి. ఈ నెల 4వ తేదీకి ఫారెక్స్‌ నిల్వ లు రికార్డు స్థాయిలో 60,500 కోట్ల డాలర్లకు చేరాయి. ప్రస్తు త డాలర్‌-రూపాయి మారకం రేటు ప్రకారం ఈ నిల్వలు సుమారు రూ.44,16,500 కోట్లకు సమానం. ఈ ఏడాది మే 28తో పోలిస్తే ఫారెక్స్‌ నిల్వలు ఈ నెల 4 వ తేదీకి 736.2 కోట్ల డాలర్లు పెరిగాయి. డాలర్‌తో యూరో, పౌండ్‌, యెన్‌ వంటి కరెన్సీల మారకం రేటు పెరగడం ఇందుకు ప్రధాన కారణం. 


Updated Date - 2021-06-12T06:01:02+05:30 IST