‘మహమ్మారి ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోంది’

ABN , First Publish Date - 2021-12-14T23:38:26+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి వల్ల ఎదురైన ఇబ్బందుల

‘మహమ్మారి ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోంది’

దుబాయ్ : కోవిడ్-19 మహమ్మారి వల్ల ఎదురైన ఇబ్బందుల నుంచి భారత దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోందని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్లా చెప్పారు. భారత దేశ వాణిజ్య గణాంకాలు భరోసానిచ్చే విధంగా ఉన్నాయని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 81.72 బిలియన్ డాలర్లు వచ్చాయని చెప్పారు. ఇది అంతకుముందు కన్నా ఎక్కువ అని చెప్పారు.


సోమవారం జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరం సదస్సులో శృంగ్లా మాట్లాడుతూ, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వివిధ దేశాలతో వాణిజ్య ఒప్పందాలపై చర్చల్లో పురోగతి కనిపిస్తోందన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రిటన్, యూరోపియన్ యూనియన్, ఇజ్రాయెల్, తదితర దేశాలతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నాయన్నారు. 


గత కొన్ని సంవత్సరాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన సంస్కరణల గురించి వివరించారు. ఆర్థిక రంగాన్ని అందరికీ చేరువ చేయడానికి, సుపరిపాలనకు, అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రీన్ ఎనర్జీ హబ్‌గా దేశం ఎదుగుతోందన్నారు. ప్రపంచంలో సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ సామర్థ్యం అధికంగా గల దేశాల్లో భారత దేశం ఒకటని తెలిపారు. 


Updated Date - 2021-12-14T23:38:26+05:30 IST