విదేశీ ట్రక్ డ్రైవర్లకు వీసా.. Saudi Arabia కీలక ప్రకటన!

ABN , First Publish Date - 2022-01-26T16:29:03+05:30 IST

సౌదీ అరేబియా తాజాగా విదేశీ ట్రక్ డ్రైవర్ల వీసా విధానంలో స్వల్ప మార్పు చేసింది.

విదేశీ ట్రక్ డ్రైవర్లకు వీసా.. Saudi Arabia కీలక ప్రకటన!

రియాద్: సౌదీ అరేబియా తాజాగా విదేశీ ట్రక్ డ్రైవర్ల వీసా విధానంలో స్వల్ప మార్పు చేసింది. ఇకపై విదేశీ ట్రక్ డ్రైవర్లు సౌదీలో ప్రవేశానికి ఎంట్రీ వీసా తీసుకోవడం తప్పనిసరి చేసింది. ఒమన్ రాజధాని మస్కట్‌లోని సౌదీ ఎంబసీ ద్వారా ఈ వీసా పొందాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఒమన్ చాంపర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీకి(ఓసీసీఐ) ట్రక్ డ్రైవర్లకు ఎంట్రీ వీసా ఇచ్చేది. ఇప్పుడు ఓసీసీఐ బదులుగా సుల్తానేట్‌లోని సౌదీ ఎంబసీలో వీసా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఓసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. ట్రక్స్ ద్వారా సరుకు రవాణా చేసే వ్యాపారస్థులు తమ డ్రైవర్లకు ఎంట్రీ వీసా తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. అది చివరి గమ్యస్థానమైనా, తాత్కాలిక ట్రాన్సిట్ అయినా కూడా ఎంట్రీ వీసా పొందడం తప్పనిసరి అని ఓసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది. మస్కట్‌లోని సౌదీ రాయబార కార్యాలయం జారీ చేసిన సర్క్యులర్ నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. 

Updated Date - 2022-01-26T16:29:03+05:30 IST