విదేశీయుల నోట 'హరే రామ-హరే కృష్ణ'... తన్మయులువుతున్న నెటిజన్లు

ABN , First Publish Date - 2022-07-17T16:25:37+05:30 IST

ఇప్పుడు ప్రపంచం మొత్తానికి భారతీయ సంస్కృతి...

విదేశీయుల నోట 'హరే రామ-హరే కృష్ణ'... తన్మయులువుతున్న నెటిజన్లు

ఇప్పుడు ప్రపంచం మొత్తానికి భారతీయ సంస్కృతి గురించి తెలుస్తోంది. దీనిని చూసేందుకు పలువురు విదేశీయులు భారతదేశానికి వస్తున్నారు. మధుర-బృందావనంలో ఎప్పుడూ విదేశీయుల రద్దీ ఉంటుంది. కొందరు విదేశీయులు హిందూ మతాన్ని స్వీకరిస్తున్నారు. 


కొందరు విదేశీయులు భజనలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఒక విదేశీయుడు 'హరే రామ-హరే కృష్ణ' సంకీర్తనలు చేస్తూ కనిపిస్తున్నాడు. అతని వెనుక కొంతమంది విదేశీ స్త్రీలు నృత్యం చేస్తూ కనిపిస్తున్నారు. ఈ వీడియోను నెటిజన్లు అమితంగా ఇష్టపడుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో Knowledge_of_bhagavad_gita పేరుతో షేర్ చేశారు. ఈ వీడియోకు 6 లక్షల 86 వేలకు పైగా వ్యూస్ దక్కాయి.

Updated Date - 2022-07-17T16:25:37+05:30 IST