రైతుల సంక్షేమమే ప్రభుత ్వ ధ్యేయం

ABN , First Publish Date - 2021-04-18T05:22:28+05:30 IST

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య పేర్కొన్నారు. అద్దంకి మార్కెట్‌ యార్డు ఆవరణలో ఏపీ మా ర్కెఫెడ్‌, నాఫెడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం, అనంతరం పట్టణంలోని గొరకాయపాలెం, గరటయ్య కాలనీల వద్ద రూ. 1.60 కోట్లతో నిర్మించనున్న డాక్టర్‌ వైఎ్‌సఆర్‌ అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌ సెంటర్‌ల భవనాల నిర్మాణానికి శనివారం కృ ష్ణచైతన్య శంకుస్థాపన చేశారు.

రైతుల సంక్షేమమే ప్రభుత ్వ ధ్యేయం
మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య

నియోజకవర్గ ఇన్‌చార్జి కృష్ణచైతన్య


అద్దంకి, ఏప్రిల్‌ 17: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని వైసీపీ అద్దంకి  నియోజకవర్గ  ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య పేర్కొన్నారు. అద్దంకి మార్కెట్‌ యార్డు ఆవరణలో ఏపీ మా ర్కెఫెడ్‌, నాఫెడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం,  అనంతరం  పట్టణంలోని గొరకాయపాలెం, గరటయ్య కాలనీల వద్ద రూ. 1.60 కోట్లతో నిర్మించనున్న  డాక్టర్‌ వైఎ్‌సఆర్‌ అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌ సెంటర్‌ల భవనాల నిర్మాణానికి  శనివారం కృ ష్ణచైతన్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు మద్దతుధర కల్పించేందుకు ప్రభు త్వం  కొనుగోలు  కేంద్రాలను ప్రారంభించింద న్నారు. ఆర్‌బీకేల ద్వారా అన్ని రకాల పంట ఉ త్పత్తులు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చ ర్యలు చేపడుతుందని చెప్పారు. అలాగే అద్దంకి పట్టణ ప్రజలకు మెరుగైన వైద్యం మరింత  అ ందుబాటులోకి తీసుకువచ్చేందుకు అర్బన్‌ హె ల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేసిందన్నారు. గరటయ్య కాలనీ వద్ద ఉన్న 2.60 ఎకరాల  స్థలంలో అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌ సెంటర్‌, అగ్నిమాపక కేంద్రంతో పాటు అన్ని వసతులతో పార్కును అభివద్ధి చే స్తామన్నారు. ఈ  కార్యక్రమాలలో నగరపంచాయతీ  చైర్‌పర్సన్‌ ఎస్తేరమ్మ, వైస్‌ చైర్మన్‌  దే సు పద్మేష్‌, ఏఎంసీ చైర్మన్‌ భువనేశ్వరి, కమిషనర్‌ ఫజులుల్లా, ఏఎంసీ ప్రత్యేకకార్యదర్శి శ్రీనివాస్‌, మాజీ ఎంపీపీ జ్యోతి  హనుమంతరావు, చింతల పేరయ్య, శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానం చైౖర్మన్‌  కోట శ్రీనివాసకుమార్‌, కాకాని  రాధాకృష్ణమూర్తి, సందిరెడ్డి ర మేష్‌, కౌన్సిలర్‌లు అనంతలక్ష్మి, రమణ, బాలు, నాగరాజు, సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-18T05:22:28+05:30 IST