అడవిలో ఇష్టారాజ్యం

ABN , First Publish Date - 2021-05-04T06:07:39+05:30 IST

అధికారులు వారే... కాంట్రాక్టర్లు వారే. ఇక నాణ్యతను ప్రశ్నించేదెవరు.. పనుల కొలతలపై ఎవరు ఆరా తీస్తారు? భూపాలపల్లి అటవీ శాఖలో జరుగుతున్నది అదే.

అడవిలో ఇష్టారాజ్యం
రాంపూర్‌ సమీపంలోని చెక్‌డ్యాం

చెక్‌డ్యాం నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపం 

రూ.4.12 కోట్ల నిఽధులు మంజూరు

కాంట్రాక్టర్ల అవతారమెత్తిన ఫారెస్టు అధికారులు

నామినేషన్‌ పద్ధతిలో 161 పనులు

కొలతల తేడాతో చేతివాటం!

కాకతీయఖని, మే 3: అధికారులు వారే... కాంట్రాక్టర్లు వారే. ఇక నాణ్యతను ప్రశ్నించేదెవరు.. పనుల కొలతలపై ఎవరు ఆరా తీస్తారు? భూపాలపల్లి అటవీ శాఖలో జరుగుతున్నది అదే. 

అటవీ శాఖ సంరక్షణ కోసం, వన్యప్రాణుల పరిరక్షణ కోసం 2016లో కంపెన్సేటరీ అఫారెస్టేషన్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ప్లానింగ్‌ అఽథారిటీ (కంపా)ను కేం ద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని ద్వారా ప్రతి ఏడా ది కోట్లాది నిధులు మంజూరు చేస్తోంది.  అలాగే  కం పెన్సేటరీ అఫారెస్టేషన్‌ (సీఏ), కంపెన్సేటరీ అఫారెస్టేష న్‌ ప్రాజెక్టు డైవర్షన్‌ (సీఏడీపీ) ద్వారా నిధులు మం జూరవుతున్నాయి. వీటితో అటవీ శాఖ పరిధిలో కుంట లు, చెక్‌డ్యాంలు, ఇంకుడు గుంతలు నిర్మిస్తారు. అయి తే స్కీంలు మంచివైనా నిధులు ఎక్కువ శాతం దుర్వినియోగం అవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రూ. 5లక్షల లోపు పనులు అధికారులే నేరుగా చేసుకో వచ్చ నే నిబంధన వారికి వరంగా మారింది.  

చేపట్టిన పనులు ఇవే..

వన్యప్రాణులకు ఉపయోగపడేలా అటవీ ప్రాంతం లో రాక్‌ఫిల్‌ చెక్‌డ్యాంలు, నీటి ఇంకుడు గుంతలు, కుం టల నిర్మాణ పనులు జరిగాయి. వీటి కోసం 2019-20, 2020-21 ఆర్ధిక సంవత్సరంలో సుమారు రూ.4.12 కో ట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ క్రమంలో జిల్లాలోని పలు చోట్ల 66 చెక్‌డ్యాంలు, 45 కుంటలు, 50 ఇంకుడు గుంతల నిర్మాణ పనులు చేపట్టారు. జిల్లాలో తొమ్మిది అటవీ శాఖ రేంజ్‌ కార్యాలయాలు ఉ న్నాయి.  2019-20, 2020-21 ఆర్ధిక సంవత్సరంలో జరిగిన పనుల్లో భూపాలపల్లి రేంజ్‌ పరిధిలో ఎనిమిది చె క్‌డ్యాంలు, ఆరు కుంటల పనులు జరిగాయి. ఆజంనగ ర్‌ పరిధిలో నాలుగు చెక్‌డ్యాంలు, రెండు కుంటలు, చె ల్పూరు పరిధిలో నాలులు చెక్‌డ్యాంలు, ఆరు కుంటలు, దూదేకులపల్లిలో నాలుగు చెక్‌డ్యాంలు, ఆరు కుంటలు, కొయ్యూరులో 25 చెక్‌డ్యాంలు, ఆరు కుంటలు, పలిమెలలో ఆరు చెక్‌డ్యాంలు, రెండు కుంటలు, ఏడు ఇంకు డు గుంతలు పనులు చేశారు. కాటారంలో ఐదు చెక్‌డ్యాంలు, ఐదు కుంటలు, మహదేవపూర్‌లో ఆరు చెక్‌డ్యాంలు, ఆరు కుంటలు, 20 ఇంకుడు గుంతలు, పెగడపల్లిలో ఆరు చెక్‌డ్యాంకులు, 14 ఇంకుడుగుంతలు నిర్మాణం చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

అధికారులే కాంట్రాక్టర్లు..

జిల్లాలోని తొమ్మిది రేంజ్‌ కార్యాలయాల పరిధిలో జ రిగిన చెక్‌డ్యాం, కుంటలు, ఇంకుడు గుంతల నిర్మాణ పనులన్నీ రేంజర్లు, సెక్షన్‌ అధికారులే చేపట్టారు. రూ.5 లక్షల లోపు పనులన్నీ నామినేషన్‌ పద్ధతిలో చేయొచ్చ నే నిబంధనల ప్రకారం ఈ పనులు జరిగాయి. అధికారులే కాంట్రాక్టర్లు కావటంతో పనులను మమ అనిపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అడవిలోకి జరిగిన పనులను పరిశీలించే అవకాశమే లేదని, పైగా చెక్‌డ్యాంలు, కుంటల నిర్మాణం లాంటి పనులు వర్షకాలం వరకు సాగ తీస్తారని స్థానికులు చెబుతున్నారు. వర్షానికి కుంటలు, చెక్‌డ్యాంలోకి నీళ్లు చేరటంతో కొలతలు కూడా సక్రమంగా చేసే అవకాశం ఉండదు. దీంతో కాంట్రాక్టు చేసిన అధికారి చెప్పిందే లెక్క. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పట్టించకొనే సమయం ఉన్నతాధికారులకు ఉండటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కొలతల్లో తేడా.. నాణ్యతలో మస్కా

అధికారులే చేస్తున్న పనులపై పలు అనుమానాలు వ్యక్తమవుత ున్నాయి. చెక్‌డ్యాంల నిర్మాణ పనుల్లో అట వీ ప్రాంతంలో లభించే ఇసుక, రాళ్లు, కంకర వాడకుం డా బయట నుంచి నాణ్యత తక్కువ ఉన్న మెటీరియల్‌ ను వినియోగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చె క్‌ డ్యాంల నిర్మాణానికి 40 ఎంఎం కంకరకు బదులు 20ఎంఎం,  60ఎంఎంకు బదులు 40 ఎంఎం కంకరను వాడినట్టు సమాచారం. అలాగే 10 మీటర్ల పొడవు ని ర్మించాల్సి చెక్‌డ్యాంను ఎనిమిది మీటర్లు మాత్రమే ని ర్మించి నిధులకు కన్నం వేశారనే ఆరోపణలు ఉన్నాయి. చాలా చెక్‌డ్యాంలకు నీరు ఇంకే రాళ్ల తెట్టలు నిర్మాణం చేయకుండానే సగంలో వదిలేశారు. దూదేకులపల్లిలో గ్రామ శివారులో రోడ్డు పక్కన కట్టిన చెక్‌డ్యాంను, రాం పూర్‌ సమీపంలో గట్టమ్మ వద్ద నిర్మించిన చెక్‌డ్యాంను పరిశీలిస్తే ఎంత నాణ్యత ఉందో తెలుస్తుందని స్థ్థానికు లు అంటున్నారు. కొలతల్లో పరిశీలిస్తే చాలా తేడాలు వస్తాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇలా ఒక్కో చెక్‌డ్యాంను రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు మాత్రమే ఖర్చు చేసి రూ.4.99 లక్షల వరకు బిల్లులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే రోడ్ల పక్క న కుంటలు చేశారు. వాటిని నాలుగు గంటల్లో పనిపూ ర్తి చేసి అటు మట్టిని ఇటు పోసి కనీసం 100 మీటర్ల వరకు కట్ట నిర్మాణం చేయలేదనే విమర్శలు వస్తున్నా యి. దీనికి రూ.50 వేలు వెచ్ఛించి రూ. లక్ష ఖర్చు చేసినట్టు బిల్లులు తీసుకున్నట్లు ఆ శాఖ సిబ్బంది ఆరోపిస్తున్నారు. అడవీ శాఖలో ఈ రెండేళ్లు చేపట్టిన పనుల పై విజిలెన్స్‌ విచారణ జరిపితే అసలు నిజాలు బయటపడతాయని పలు గ్రామాల ప్రజలు అంటున్నారు.

రక్షణ ఎలా..?

జిల్లాలోని తొమ్మిది రేంజ్‌ల పరిధిల్లో నిర్మించిన చెక్‌డ్యాంలు, ఇంకుడు గుంతలు, కుంటల్లో దాదాపు ఎక్కువ శాతం రోడ్డుకు పక్కనే చేపట్టారు. రోడ్డుకు పక్కనే నిర్మాణం చేయడం వల్ల వన్యప్రాణులు  బయటికి వచ్చి నీరు తాగే పరిస్థితి ఉందా..? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిత్యం బిజీగా ఉండే ఈ రోడ్ల వెంట ప్రజలు ప్రయాణం చేస్తుంటే.. వన్యప్రాణులు అక్కడికి వస్తే ఎలా ? అని పలువురు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులు సులువుగా జరగడం కోసమే అధికారులు రోడ్ల పక్కన కట్టారనే విమర్శలు కూడా వస్తున్నాయి.  



Updated Date - 2021-05-04T06:07:39+05:30 IST