రాష్ట్రంలో అడవుల అభివృద్ధి భేష్‌

ABN , First Publish Date - 2022-05-29T05:16:45+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పచ్చదనం పెంపు, అడవుల పునరుద్ధరణ చాలా బాగున్నాయి అని కేరళ అటవీశాఖ అధికారులు కితాబునిచ్చారు.

రాష్ట్రంలో అడవుల అభివృద్ధి భేష్‌
నర్సంపల్లి అడవిని పరిశీలిస్తున్న అధికారులు

  కేరళ అటవీశాఖ అధికారుల కితాబు

ములుగు, మే 28: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పచ్చదనం పెంపు, అడవుల పునరుద్ధరణ చాలా బాగున్నాయి అని కేరళ అటవీశాఖ అధికారులు కితాబునిచ్చారు. రెండు రోజులుగా రాష్ట్రంలో పర్యటించిన కేరళ ఐఎ్‌ఫఎస్‌ అధికారులు కీర్తి, మహమ్మద్‌ షాబాద్‌, పచ్చదనం పెంపు కార్యక్రమాలను అధ్యయనం చేశారు ఇందులో భాగంగా తెలంగాణకు హరితహారం పట్టణ ప్రాంత అడవుల, పార్కుల అభివృద్ధి పునరుద్ధరణ అలాగే అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటుచేసిన అటవీ కళాశాల పరిశోధనా సంస్థ చాలా బాగున్నాయని కేరళ అధికారులు ప్రశంసించారు. శనివారం సిద్దిపేట జిల్లా ములుగు మండలం సెంట్రల్‌ నర్సరీతో పాటు  నర్సంపల్లి బ్లాక్లో అటవీ పునరుద్ధరణ సింగయా పల్లిలో మోడల్‌ ప్లాంటేషన్‌ గజ్వేల్‌ పరిసరాల్లో అవెన్యూ ప్లాంటేషన్‌ కోమటి బండ మిషన్‌ భగీరథ ప్రాజెక్టు పల్లెప్రకృతి వనాలు అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులను రెండు రోజులుగా  అధికారులు పరిశీలించి అధ్యయనం చేశారు. ముఖ్యంగా క్షీణించిన అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి పరిరక్షించిన విధానం అధికారుల పనితీరుకు నిదర్శనమని మెచ్చుకున్నారు. అవుటర్‌ రింగ్‌ రోడ్డు వెంట ఇరువైపులా ఏర్పాటుచేసిన పచ్చదనం ఆహ్లాదకరంగా ఉందన్నారు.   కార్యక్రమంలో సీఎం ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్‌, మెదక్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ శరవణన్‌, సిద్దిపేట జిల్లా అటవీ అధికారి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-29T05:16:45+05:30 IST