Viral Video: అడవిలోని చిరుత అనూహ్యంగా బావిలో కొట్టుమిట్టాడం చూసి షాకైన జనం.. చివరికి..

ABN , First Publish Date - 2022-04-08T17:57:31+05:30 IST

అరణ్యంలో ఉండాల్సిన జంతువులు.. ఒక్కోసారి జనారణ్యంలోకి చొరబడుతుంటాయి. ఈ కారణంగా కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంటుంది. అడవుల నరికివేత తదితర కారణాల వల్ల...

Viral Video: అడవిలోని చిరుత అనూహ్యంగా బావిలో కొట్టుమిట్టాడం చూసి షాకైన జనం.. చివరికి..

అరణ్యంలో ఉండాల్సిన జంతువులు.. ఒక్కోసారి జనారణ్యంలోకి చొరబడుతుంటాయి. ఈ కారణంగా కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంటుంది. అడవుల నరికివేత తదితర కారణాల వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతుంటాయి. వేసవి సమయంలో అడవుల్లోని జంతువులు దాహార్థిని తీర్చుకునేందుకు అప్పుడప్పుడూ అటవీ సమీప గ్రామాల్లోకి వస్తుంటాయి. తాజాగా మహారాష్ట్రలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ చిరుత దాహార్థిని తీర్చుకునేందుకు వచ్చిందో, ఏమో తెలీదు గానీ.. పొరపాటున గ్రామ సమీపంలోని బావిలో పడి కొట్టుమిట్టాడం కనిపించింది. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడ గుమికూడారు. చివరకు ఏమైందంటే..


అడవుల నరికివేత కారణంగా వణ్య ప్రాణులకు రక్షణ లేకుండా పోతోంది. అందులోనూ వేసవి కావడంతో కొన్ని జంతువులు దిక్కుతోచని స్థితిలో జనావాసాల్లోకి చొరబడుతుంటాయి. మహారాష్ట్ర దేవల్‌గావ్ రాజా అటవీ రేంజ్ పరిధిలోని ఖలియాల్ గ్రామంలోకి గురువారం ఓ చిరుత చొరబడింది. దాహం తీర్చుకోవడానికి వచ్చిందో, ఏమో తెలీదు గానీ.. ఓ బావిలో పడి కొట్టుమిట్టాడుతూ ఉండడాన్ని స్థానికులు గమనించారు. దీంతో చిరుతను చూసేందుకు గ్రామస్తులంతా అక్కడ గుమికూడారు. కొందరు అటవీ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అధికారులు.. ఓ బోనుకు తాళ్లు కట్టి లోపలికి దించారు. అలాగే మరోవైపు మంచానికి కూడా తాళ్లు కట్టి బావిలోకి వదిలారు. ముందుగా మంచాన్ని పులి సమీపంలో ఉంచారు. అప్పటికే నీటిలో మునిగిపోయి ఉన్న చిరుత... వెంటనే మంచం పైకి ఎక్కింది. తర్వాత దాన్ని చాకచక్యంగా బోను వద్దకు తీసుకెళ్లారు. దీంతో చిరుత మంచం పైనుంచి బోనులోకి వెళ్లింది. ఎట్టకేలకు చిరుతను క్షేమంగా బయటికి తీయగలిగారు. వైద్య పరీక్షల అనంతరం పులిని అడవిలో వదిలిపెడతామని అధికారులు తెలిపారు. 

వావ్! ఇతడి టాలెంటే వేరు... రిక్షాపై రూప్ గార్డెన్.. ఎంత బాగుందంటూ నెటిజన్ల ప్రశంసలు..





Updated Date - 2022-04-08T17:57:31+05:30 IST