నూజివీడు టౌన్, మార్చి 26: తెలంగాణలోని ఖమ్మం నుంచి బొలేరోలో రవాణా చేస్తున్న 18 అడవి పందులను శనివారం స్వాధీనం చేసుకున్నామని పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ అంకబాబు తెలిపారు. నూజివీడు అన్నవరం బైపాస్ రోడ్డులో వాహనాన్ని ఆపి, అడవి పందులను స్వాధీనం చేసుకున్నామని, ఉంటుగూరు మండలం తేలప్రోలు గ్రామానికి చెందిన దేవరకొండ జోజిబాబు, పెదపారుపూడి మండలం తమ్మలపాడు గ్రామానికి చెందిన డ్రైవర్ గడ్డం సాంబశివరావును అరెస్టు చేశామన్నారు. అడవి పందులను ఫారెస్టు అధికారులకు అప్పగించామన్నారు.