కదులుతున్న కబ్జాల డొంక

ABN , First Publish Date - 2021-03-06T04:48:47+05:30 IST

నిజామాబాద్‌ నగర శివారులోని నాగారం పరిధిలో పేదలకు ఇచ్చిన భూముల్లో జరుగుతున్న కబ్జా వ్యవహారంలో పలు కొత్త విషయాలు బ యటపడుతున్నాయి. అసలైన పట్టాలు పొందిన వారితో పాటు కబ్జా చేసి న వారు కూడా అదే నెంబర్‌లతో పట్టాలను తీసుకువచ్చి చూపిస్తుండడం తో అధికారులు విస్మయానికి గురవుతున్నారు.

కదులుతున్న కబ్జాల డొంక
పోలీసు బందోబస్తు మధ్య సర్వే నిర్వహిస్తున్న అధికారులు

నాగారంలో పేదల భూముల కబ్జాలో బయటపడుతున్న ఫోర్జరీ డాక్యుమెంట్లు

గతంలో పనిచేసిన అధికారుల పేర్లతో డాక్యుమెంట్ల సృష్టి

పాత జాబితా ప్రకారం పరిశీలిస్తున్న సర్వే అధికారులు

అధికారుల ముందే అసలు లబ్ధిదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న కబ్జాదారులు

నిజామాబాద్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిజామాబాద్‌ నగర శివారులోని నాగారం పరిధిలో పేదలకు ఇచ్చిన భూముల్లో జరుగుతున్న కబ్జా వ్యవహారంలో పలు కొత్త విషయాలు బ యటపడుతున్నాయి. అసలైన పట్టాలు పొందిన వారితో పాటు కబ్జా చేసి న వారు కూడా అదే నెంబర్‌లతో పట్టాలను తీసుకువచ్చి చూపిస్తుండడం తో అధికారులు విస్మయానికి గురవుతున్నారు. దీంతో ఈ వ్యవహారాన్ని మరింత లోతుగా పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా అప్పుడు పనిచేసిన రె వెన్యూ అధికారుల సంతకాలు ఫోర్జరీ అయినట్లు గుర్తిస్తున్నారు. ఆ వివరాలను కూడా తమ సర్వేలో పొందుపరుస్తున్నారు. గతంలో పనిచేసిన రె వెన్యూ అధికారులు కూడా తమ సంతకాలు ఫోర్జరీ అయినట్లు నమోదు చేసిన కేసులను కూడా పరిశీలిస్తున్నారు. కబ్జాలో ఉండి ఇళ్లుసైతం నిర్మించడంతో అధికారులు పూర్తిస్థాయిలో నివేదికలు అందిన తర్వాతనే పట్టాల ఆధారంగా పిలిచి సరిచే సే విధంగా చర్యలు చేపట్టనున్నారు. 

600ల మందికిపైగా పట్టాలు

నిజామాబాద్‌ నగర శివారులోని నాగారంలో పేదలకు 2005 నుంచి 2014 మధ్య కాలంలో 600ల మందికిపైగా పట్టాలు ఇచ్చారు. ఇళ్లులేని ని రుపేదలకు భూములను అందజేశారు. ప్రతి ఒక్కరికి 60 గజాల నుంచి 80 గజాల మధ్య పట్టాలు అందించారు. పట్టాలు ఇచ్చిన సంవత్సరంలోపు ఇళ్లు నిర్మించుకోవాలని కోరారు. నిరుపేదలైన చాలా మంది పట్టాలు తీసుకున్నా భూములు చూసుకోక.. ఆర్థికంగా లేక ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. పేదలతో పాటు పలు సంఘాల తరపున తీసుకున్న భూముల్లో కూడా ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. ఇదే అదునుగా కబ్జాదారులు ఆ భూములపై కన్నేశారు. అదే సర్వే నంబర్‌లతో కొత్త పట్టాలు సృష్టించారు. దొంగ డాక్యుమెంట్లను సృష్టించి విక్రయించేశారు. పేదలకు ఇచ్చిన కొన్ని పట్టాల పరిధి లో ఇళ్ల నిర్మాణం చేశారు. కొంతమందికి నోటిమాటగా అమ్మకాలు చేసి ప్రామిసరీ నోట్లపై రాసుకున్నారు. వాటిని కొన్నవారు ఇళ్ల నిర్మాణంతో పా టు ఇతర కట్టడాలను చేపట్టారు. ఈ మధ్య నగరం పరిధిలో భూముల రేట్లు పెరగడం, పేదలు కూడా ఇళ్ల నిర్మాణం చేసుకుందామని భూముల వద్దకు వెళ్లగా ఆ భూములు కబ్జాకు గురికావడంతో అధికారులకు ఫిర్యా దు చేశారు. తమకు ఇచ్చిన పట్టా భూములను తిరిగి అప్పగించాలని కోరుతున్నారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

కలెక్టర్‌ ఆదేశాలతో సర్వే

కొంతమంది ప్రజాప్రతినిధుల అండదండలతో భూముల కబ్జాకు పా ల్పడి బాజాప్తుగా కొనసాగిస్తున్నారు. అడ్డువచ్చిన వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారు. పేదల వద్ద పట్టాలు ఉన్నా.. తమకు డబ్బులు ఇస్తేనే ఇళ్ల నిర్మాణం చేయనిస్తామని భయాందోళనకు గురిచేస్తున్నారు. వీటన్నింటిపై న ఫిర్యాదులు అందడంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు గడిచిన 4 రోజులుగా ఆ భూముల్లో సర్వే చేస్తున్నారు. ఈ సర్వేలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడుతున్నాయి. గతంలో పనిచేసిన తహసీల్దార్‌లు, ఇతర రెవెన్యూ అధికారులే ఇచ్చినట్లు ఫోర్జరీ సంతకాలతో డాక్యుమెంట్లను సృష్టించారు. ఆ భూములను కబ్జాచేసిన తమకే పట్టాలు ఇచ్చినట్లుగా వాటిని అధికారులకు చూపిస్తున్నారు. అధికారుల దగ్గర ఉన్న లిస్టు ఆధారంగా వాటిని పరిశీలిస్తున్నారు. ఆ తొమ్మిదేళ్ల కాలంలో ఇచ్చిన పేదల లిస్టును పరిశీలిస్తున్నారు. వారిలో భూములు కొంతమంది అమ్మకాలు చే సినట్లుగా కూడా గుర్తిస్తున్నారు. వీటితో పాటు దొంగ డాక్యుమెంట్లను సృష్టించి అమ్మకాలు చేసినట్లు కూడా తమ దర్యాప్తులో వెలుగుచూస్తున్న వివరాలను నివేదికలో పొందుపరుస్తున్నారు. 

2011లోనూ దర్యాప్తు

2011లోనే ఈ ప్లాట్లపై ఫిర్యాదులు రాగా.. ఆ సమయం లో పనిచేసిన కలెక్టర్‌ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయించారు. పేదలకు ఇచ్చిన పట్టాల ఆ ధారంగా భూముల లెక్కలను సరిచేశారు. ఆ తర్వాత కూడా మరికొంత మందికి 2014లో పట్టాలు ఇచ్చారు. ఆ రెండు సమయాల్లో ప్లాట్లు పొంది న అసలైన లబ్ధిదారుల మాదిరిగానే కబ్జాదారులు కూడా అధికారుల సం తకాలు ఫోర్జరీ చేసి డాక్యుమెంట్లను సృష్టించారు. ఆ తర్వాత ఆ భూముల ను వక్రియిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో కట్టడాలను నిలిపివేసిన అ ధికారులు పూర్తి విచారణ తర్వాతనే అసలైన పట్టాదారులను గుర్తించి అ నుమతులు ఇవ్వనున్నారు. ఈ తొమ్మిదేళ్లలో కొద్దిమంది మాత్రమే ఆ ప్రాం తంలో ఇళ్లు కట్టుకున్నారు. మిగతావారు కట్టుకోకపోవడం వల్లనే ఎక్కువ గా కబ్జాకు గురైనట్లు సర్వేచేస్తున్న రెవెన్యూ అధికారులు గుర్తించారు. వెం టనే పట్టాదారులు ఇళ్ల నిర్మాణం చేసుకుంటే ఈ కబ్జాలు జరిగేవికావని వారు అభిప్రాయపడుతున్నారు. కబ్జాలు చేస్తున్నవారు కూడా ఇళ్ల నిర్మా ణం చేస్తే అనుమతులు ఎలా ఇచ్చారనే విషయాన్ని కూడా అధికారులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ వివరాలన్నీ ఆర్డీవోతో పాటు కలెక్టర్‌ కు అందించి పూర్తిస్థాయి సమీక్ష తర్వాతనే చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

అధికారుల ముందే బెదిరింపులు

నాగారం పరిధిలో భూముల సర్వే కొనసాగుతుండగానే కొంతమంది అదే ప్రాంతంలో ఉంటూ అసలైన పట్టాదారులను అధికారుల ముందే బె దిరిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. దీంతో ఆ విషయాలను కూ డా అధికారులు నివేదికలో పొందుపరుస్తున్నట్టు తెలుస్తోంది. కబ్జా చేసేవారిని గుర్తించి అవసరమైతే కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు అధి కార వర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది. భూముల పట్టాలు పొందిన అసలైన లబ్ధిదారులు మాత్రం గడిచిన నాలుగు రోజులుగా తమ వివరాలను అధికారులకు అందిస్తున్నారు. కబ్జా అయిన తమ భూములను ఇప్పించాలని కోరుతున్నారు. సర్వే చేస్తున్న అధికారులు మాత్రం తమ నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు. ఈ వ్యవహారంపై కలెక్టర్‌ నారాయణరెడ్డి పూర్తిస్థాయిలో దృష్టిసారించి అసలైన పట్టాదారులకు భూములు దక్కే విధంగా చూస్తే పే దలకు మేలు జరిగే అవకాశం ఎంతైనా ఉంది.


అర్హులైన పేదలకు న్యాయం జరిగేలా చూస్తా

ఎంపీ ఽధర్మపురి అర్వింద్‌ 

నాగారంలో పర్యటించిన ఎంపీ

నిజామాబాద్‌ అర్బన్‌/పెద్దబజార్‌, మార్చి 5: నగరంలోని నాగారం ప్రాంతంలో భారతిరాణి కాలనీ, రాహుకేతు ఆలయం పరిసర ప్రాంతంలో జరుగుతున్న కబ్జాల విషయంలో అర్హులైన పేదలకు న్యాయం జరిగేలా చూస్తానని ఎంపీ అర్వింద్‌ భ రోసా ఇచ్చారు. శుక్రవారం ఉదయం ఆయన నాగారంలో పేదలకు ఇచ్చిన ప్లాట్ల ను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం జారీ చేసిన పట్టా పాస్‌పుస్తకాలను పరిశీలించారు. కబ్జాకు గురయిన ప్లాట్ల వివరాలను తెలుసుకున్నారు. సాయంత్రం కలెక్టర్‌ సి.నారాయణరెడ్డితో సమావేశమైన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ ప్రాంతంలో 2004 నుంచి 2014 మధ్య కాలంలో పేదలకు ఇచ్చిన పట్టాలు విషయంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్‌ను కోరానన్నారు. జిల్లా యంత్రాంగం సైతం ఈ విషయంలో సీరియస్‌గా విచారణ జరుపుతోందన్నారు. జర్నలిస్టులకు సైతం న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఒక పట్టాను ఇద్దరికి లేదా ముగ్గురికి అలాట్‌ చేసిన విషయంపై కూడా విచారణ జరిపి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. టీ ఆర్‌ఎస్‌ నాయకులు, స్థానిక మేయర్‌, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఈ ఆక్రమణలు, కబ్జా ల వెనక ఉన్నారని, ప్రభుత్వ భూమిని తక్కువ ధరకు అమ్ముతున్నారని ఆయన విమర్శించారు. ప్రజలు నమ్మవద్దని, తక్కువ ధరకు ప్లాట్లు అమ్మితే తీసుకుంటే మీరే నష్టపోతారని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీని నమ్ముకుంటే నష్టపోయేది మీరేనని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవా స్‌ యోజన పథకం కింద ఇళ్లను కట్టిస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం కేసీఆర్‌ ఆ పథకాన్ని అమలు చేయకుండా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పేరుతో కాలయాపన చే స్తున్నారని ఆయన విమర్శించారు. ఈ ప్లాట్ల దందాలో టీఆర్‌ఎస్‌ నేతలందరికీ వా టా ఉందన్నారు. నగరంలో మైనార్టీ ఏరియాలో ఏర్పాటు చేసే మార్కెట్‌లోనూ అ ర్హులైన వారికి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ఎవరి మాటలు నమ్మవద్దని, ని జంగా ట్యాక్స్‌ కట్టేవారికి దుకాణాల కేటాయింపు ఉంటుందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్ర భుత్వం, ఇక్కడి నాయకులు మైనార్టీలను మోసం చేయాలని చూస్తున్నారని వారి మాయలో పడవద్దన్నారు. ఆయన వెంట బీజేపీ నాయకులు స్రవంతిరెడ్డి, ధన్‌పాల్‌సూర్యనారయణగుప్త, ధాత్రికరమేష్‌, రెవెన్యూ అధికారులు ఉన్నారు. 

కేంద్రం నిర్ణయం వల్లే పసుపు ధర పెరిగింది

రాబోయే రోజుల్లో పసుపు రైతులకు మంచి రోజులు : ఎంపీ అర్వింద్‌

ఖిల్లా, మార్చి 5 : కేంద్ర ప్రభుత్వం పసుపు దిగుమతులను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం వల్లే పసుపు ధర పెరిగిందని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నా రు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ను సందర్శించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త వ్యవసాయ సాగు చట్టాల వల్ల దేశ విదేశాలకు చెందిన వ్యాపారులు పసుపు డిమాండ్‌ను బట్టి కొనుగోలు చేసే అవకాశాలున్నాయన్నారు. గత ప్రభుత్వాలు కమీషన్ల కోసమే పసుపు దిగుమతులు పెంచడం వల్ల ఇ క్కడి పసుపునకు ధర తగ్గిపోయిందన్నారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ది గుమతులను రద్దు చేసి అందుకనుగుణంగా పసుపు ఎగుమతులను పెంచిందన్నారు. ప్రస్తు తం కొవిడ్‌ నేపథ్యంలో పసుపునకు డిమాండ్‌ పెరిగిందన్నారు. దానికి తోడు ఎగుమతులు పె రగడంతో పాటు ధర సైతం పెరుగుతోందన్నారు. రాబోయే రోజుల్లో పసుపు ధర మరింత పెరి గే అవకాశం ఉందన్నారు. నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో రైతులకు మౌలిక వసతులను కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రై తులను పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బీజేపీ నాయకులు ధన్‌పాల్‌ సూర్యనారయణగుప్తా, పల్లె గంగారెడ్డి, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఫ్లోర్‌లీడర్‌ స్రవంతిరెడ్డి, మాస్టర్‌ శంకర్‌, శ్రీనివాస్‌రెడ్డి, వినయ్‌రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, మధు, ధాత్రికరమేష్‌ ఉన్నారు. 

Updated Date - 2021-03-06T04:48:47+05:30 IST