రైతులపై విరిగిన లాఠీ

ABN , First Publish Date - 2021-06-15T17:25:43+05:30 IST

విత్తనం కోసం వచ్చిన రైతులపై పోలీసులు లాఠీ ఝళిపించారు. ఒక్కసారిగా లాఠీలతో బాదుతుండడంతో రైతులు పరుగులు తీశారు. నగరంలోని వ్యవసాయశాఖ కార్యాలయంలో

రైతులపై విరిగిన లాఠీ

            - మిరప విత్తనం కోసం ఎగబడిన అన్నదాతలు

            - అదుపు తప్పడంతో పోలీసుల ప్రతాపం


బళ్లారి(కర్ణాటక): విత్తనం కోసం వచ్చిన రైతులపై పోలీసులు లాఠీ ఝళిపించారు. ఒక్కసారిగా లాఠీలతో బాదుతుండడంతో రైతులు పరుగులు తీశారు. నగరంలోని వ్యవసాయశాఖ కార్యాలయంలో సోమవారం ఆ శాఖ ఆధ్వర్యంలో మిరపవిత్తనం పంపిణీ చేపట్టారు. బయటి మార్కెట్‌ కన్నా ప్రభుత్వం ఇస్తున్న సబ్బిడీ విత్తనం ధర తక్కువగా ఉండడంతో కొనుగోలుకు బళ్లారి తాలూకాలోని రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. క్యూలో బారులు తీరారు. అయితే విత్తనం ఇచ్చే సమయంలో ఓ రైతు క్యూలో నుంచి పక్కకు వచ్చి నేరుగా కౌంటర్లోకి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన మిగిలిన రైతులు కూడా పెద్ద సంఖ్యలోనే క్యూను వదిలి కౌంటర్లలో లోపలికి వెళ్లి విత్తనం తీసుకునే ప్రయత్నం చేశారు. రైతులు క్యూలో నిలుచోవాలని పోలీసులు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో పోలీసులు ఒక్కసారిగా లాఠీలతో రైతులను బాదడం మొదలు పెట్టడంతో క్యూలో నిలుచున్న వారు కూడా పరుగులు తీశారు. కొద్ది సేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆ తరువాత పరిస్థితి సద్దుమనగడంతో అధికారులు మిరప విత్తనం పంపిణీ ప్రారంభించారు. ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు మిరప విత్తనాలు సబ్సిడీతో ఇస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం సబ్సిడీతో ఇస్తున్న మిరప విత్తనం 100 గ్రాములు ధర రూ. 5531. అదే విత్తనం బయట మార్కెట్‌లో వంద గ్రాములు రూ. 7,500 పైచిలుకు పలుకుతోంది. దీంతో రైతులు మిరప మిత్తనం కొనుగోలుకు అధిక సంఖ్యలో తరలి వచ్చారని వ్యవసాయ అధికారి పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-15T17:25:43+05:30 IST