నేడు హైదరాబాద్‎లో రెండోరోజు Rahul Gandhi పర్యటన

ABN , First Publish Date - 2022-05-07T13:55:17+05:30 IST

ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రెండోరోజు భాగ్యనగరంలో పర్యటించనున్నారు. తాజ్ కృష్ణాలో ముఖ్య నేతలతో కలిసి

నేడు హైదరాబాద్‎లో రెండోరోజు Rahul Gandhi పర్యటన

హైదరాబాద్‌: ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రెండోరోజు భాగ్యనగరంలో పర్యటించనున్నారు. తాజ్ కృష్ణాలో ముఖ్య నేతలతో కలిసి అల్పాహారం చేయనున్నారు. అనంతరం తెలంగాణ ఉద్యమకారులతో రాహుల్ సమావేశంకానున్నారు. మధ్యాహ్నం 12.30కి చంచల్‌గూడ జైలులో ఎన్‌ఎస్‌యూఐ నేతలను పరామర్శించనున్నారు. ఆపై సంజీవయ్య పార్క్‎లో దామోదర సంజీవయ్య విగ్రహానికి కాంగ్రెస్ అగ్రనేత నివాళులర్పించనున్నారు.  అక్కడి నుంచి నేరుగా గాంధీభవన్‌‌కు చేరుకుని పార్టీ సీనియర్‌ నేతలతో రాహుల్‌ భేటీ కానున్నారు. భేటీ అనంతరం తిరిగి సాయంత్రం రాహుల్ ఢిల్లీ వెళ్లనున్నారు.

Read more