బీసీసీఐ మాజీ కార్యదర్శి అమితాబ్‌ చౌధురి హఠాన్మరణం

ABN , First Publish Date - 2022-08-17T10:08:30+05:30 IST

బీసీసీఐ మాజీ కార్యదర్శి, జార్ఖండ్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు అమితాబ్‌ చౌధురి.

బీసీసీఐ మాజీ కార్యదర్శి అమితాబ్‌ చౌధురి హఠాన్మరణం

రాంచీ: బీసీసీఐ మాజీ కార్యదర్శి, జార్ఖండ్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు అమితాబ్‌ చౌధురి (62).. మంగళవారం ఉదయం గుండెపోటుతో మరణించాడు. రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన అమితాబ్‌.. జార్ఖండ్‌ జట్టుకు ఫస్ట్‌ క్లాస్‌ హోదా తీసుకురావడానికి విశేషంగా కృషి చేశాడు. 2005లో గంగూలీ-చాపెల్‌ వివాద సమయంలో భారత జట్టు అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌గా అమితాబ్‌ వ్యవహరించాడు. బీసీసీఐలో కమిటీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటర్స్‌ (సీవోఏ) హయంలో తాత్కాలిక కార్యదర్శిగా కూడా సేవలందించాడు. కుంబ్లే-కోహ్లీ ఎపిసోడ్‌లోనూ అమితాబ్‌ సాక్షిగా నిలిచాడు. కాగా, అమితాబ్‌ హఠాన్మరణం తనను షాక్‌కు గురి చేసిందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నాడు. జార్ఖండ్‌ క్రికెట్‌ రూపురేఖలు మార్చడంలో చౌధురిది కీలకపాత్ర అని బోర్డు కార్యదర్శి జై షా తెలిపాడు. 

Updated Date - 2022-08-17T10:08:30+05:30 IST