Police Custody: మాజీ సీఐ నాగేశ్వరరావు ముగిసిన కస్టడీ

ABN , First Publish Date - 2022-07-22T20:15:58+05:30 IST

మహిళపై అత్యాచారం కేసులో మాజీ సీఐ నాగేశ్వరరావు కస్టడీ ముగిసింది.

Police Custody: మాజీ సీఐ నాగేశ్వరరావు ముగిసిన కస్టడీ

హైదరాబాద్: మహిళపై అత్యాచారం కేసులో మాజీ సీఐ నాగేశ్వరరావు (Nageshwar rao) కస్టడీ (Custody) ముగిసింది. ఐదు రోజులపాటు నాగేశ్వర్ రావును వనస్థలిపురం పోలీసులు విచారించారు. కస్టడీ ముగిసిన నేపథ్యంలో పోలీసులు ఈరోజు నాగేశ్వర్‌రావును హయత్‌నగర్ కోర్టు ముందు హాజరుపరిచారు. అనంతరం జ్యూడీషియల్ రిమాండ్‌కు మాజీ సీఐను తరలించారు. మహిళపై అత్యాచారం, కిడ్నాప్, ఆక్సిడెంట్ కేసులపై ఏసీపీ పురుషోత్తం రెడ్డి విచారించారు. బాధితురాలు ఇంటి దగ్గర నుండి యాక్సిడెంట్ అయిన ఇబ్రహీంపట్నం చెరువు వరకు పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు.

Updated Date - 2022-07-22T20:15:58+05:30 IST