Former Chief Minister: మరోసారి చిక్కుల్లో మాజీ ముఖ్యమంత్రి..

ABN , First Publish Date - 2022-09-08T17:23:21+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ కేంద్ర పార్లమెంటరీ బోర్డు సభ్యుడు యడియూరప్ప(Yeddyurappa)తో పాటు కుటుంబీకుల అవినీతిపై హైకోర్టు

Former Chief Minister: మరోసారి చిక్కుల్లో మాజీ ముఖ్యమంత్రి..

- కుటుంబీకులపై అవినీతి ఆరోపణలు

- విచారణకు హైకోర్టు ఆదేశం 


బెంగళూరు, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ కేంద్ర పార్లమెంటరీ బోర్డు సభ్యుడు యడియూరప్ప(Yeddyurappa)తో పాటు కుటుంబీకుల అవినీతిపై హైకోర్టు విచారణకు ఆదేశించింది. దీంతో మరోసారి యడియూరప్ప చిక్కుల్లో పడ్డా రు. సామాజిక కార్యకర్త టీజే అ బ్రహాం గతంలో యడియూరప్ప అవినీతిపై విచారణ జరపాలని కోర్టులో పిటీషన్‌ దాఖలు చేయగా ప్రాసిక్యూషన్‌ నుంచి అనుమతులు లభించనందున కేసును కొట్టివేశారు. బుధవారం అదే కేసును విచారణకు హైకోర్టు(High Court) ఆదేశించింది. కేసులో బీఎస్‌ యడియూరప్పతో పాటు ఆయన కుమారుడు, బీజేపీ  రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవై విజయేంద్ర, బంధువులు శశిధర్‌ మరడి, సంజయ్‌శ్రీ, చంద్రకాంత్‌ రామలింగం, సహకార శాఖ మంత్రి ఎస్‌టీ సోమశేఖర్‌(Minister ST Somasekhar), డాక్టర్‌ జేసీ ప్రకాష్‌, కే రవి, విరూపాక్షప్ప యమకనమరడి ఉన్నారు. హైకోర్టు ధర్మాసనం విచారణకు ఆదేశించగా యడియూరప్ప తరపు న్యాయవాది సందీప్ పాటిల్‌ సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలుకు గడువు కోరారు. కొన్నిరోజుల కిందట యడియూరప్పతో పాటు కుటుంబీకులపై అవినీతి ఆరోపణల వివాదాన్ని సీబీఐ లేదా సిట్‌ ద్వారా విచారణ జరిపించాలని కోరుతూ టీజే అబ్రహాం పిల్‌ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన ధర్మాసనం ఇప్పటికే పిటీషనర్‌ ప్రైవేటుగా ఫిర్యాదు చేసిన మేరకు పిల్‌గా పరిగణించలేమని తిరస్కరించింది. పిటీషన్‌ను మార్పు చేసి సంబంధిత బెంచ్‌కు మార్పు చేయాలని రిజిస్ట్రార్‌ జనరల్‌కు హైకోర్టు సూచించింది. ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ నుంచి అనుమతులు లేని కారణంగా ఇటీవల ప్రజా ప్రతినిధుల ధర్మాస నం విచారణల ఆదేశాలకు నిరాకరించింది. టీజే అబ్రహాం హైకోర్టును ఆశ్రయించగా విచారణకు ఆదేశించారు.

Updated Date - 2022-09-08T17:23:21+05:30 IST