రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి బెదిరింపు కేసులో

ABN , First Publish Date - 2021-01-22T12:39:31+05:30 IST

రియల్‌ ఎస్టేట్‌ అధిపతిని బెదిరించిన కేసులో దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె సెల్వి, కోడలు జ్యోతిమణిలను పూందమల్లి న్యాయస్థానం విడుదల ...

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి బెదిరింపు కేసులో

మాజీ సీఎం కరుణానిధి కుమార్తె విడుదల

చెన్నై/పెరంబూర్‌(ఆంధ్రజ్యోతి): రియల్‌ ఎస్టేట్‌ అధిపతిని బెదిరించిన కేసులో దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె సెల్వి, కోడలు జ్యోతిమణిలను పూందమల్లి న్యాయస్థానం విడుదల చేసింది. షోలింగనల్లూర్‌ సమీపం తాళంబూర్‌ గ్రామంలో సెల్వికి సొంతమైన 2.94 ఎకరాల స్థలానికి పవర్‌ ఆఫ్‌ ఆటాన్నీగా ఆమె కోడలు జ్యోతిమణి ఉంది. ఈ స్థలాన్ని 2007లో వలసరవాక్కంకు చెందిన రియల్డర్‌ నెడుమారన్‌కు రూ.5.14 కోట్లకు విక్రయించాలని నిర్ణయించి, రూ.3.50 కోట్లను అడ్వాన్స్‌గా తీసుకున్నారు. అనంతరం స్థలాన్ని తనకు అప్పజెప్పకుండా వేరే వ్యక్తికి విక్రయించారని, తానిచ్చిన అడ్వాన్స్‌ తిరిగి ఇవ్వాలని కోరగా తనపై దాడిచేసి బెదిరించారని 2009లో నెడుమారన్‌ చెన్నై పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై విచారించిన కేంద్ర క్రైం విభాగం పోలీసులు 2012లో సెల్వి, జ్యోతిమణిపై కేసు నమోదుచేశారు. ఈ కేసు పూందమల్లి క్రిమినల్‌ కోర్టులో విచారణ జరుగుతుండగా బుధవారం జరిగిన విచారణకు సెల్వి, జ్యోతిమణి కోర్టుకు హాజరయ్యారు. కాగా ఈ కేసులో తగిన ఆధారాలు లేకపోవడంతో సెల్వి, జ్యోతిమణిలను విడుదల చేస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

Updated Date - 2021-01-22T12:39:31+05:30 IST