మాజీ క్రికెటర్ Vinod Kambli కి ఓ వ్యక్తి నుంచి ఫోన్.. కాల్ కట్ అయ్యేలోపే బ్యాంక్ ఖాతాలోంచి లక్ష ఫట్.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-12-10T23:26:12+05:30 IST

మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ కూడా వారి ఉచ్చులో పడ్డారు. ఇటీవల ఓ రోజు అపరిచిత వ్యక్తి నుంచి కాంబ్లీకి ఫోన్ వచ్చింది. కాల్ కట్ అయ్యేలోపే తన బ్యాంక్ ఖాతాలోంచి లక్ష రూపాయలు హాంఫట్ అయ్యాయి. వివరాల్లోకి వెళితే..

మాజీ క్రికెటర్ Vinod Kambli కి ఓ వ్యక్తి నుంచి ఫోన్.. కాల్ కట్ అయ్యేలోపే బ్యాంక్ ఖాతాలోంచి లక్ష ఫట్.. అసలేం జరిగిందంటే..

ప్రస్తుతం సైబర్ నేరాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో చెప్పనవసరం లేదు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా బ్యాంక్ అకౌంట్‌లోని నగదును ఖాళీ చేసేస్తారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎంతో మంది నిత్యం సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవడం చూస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు బాగా చదువుకుని, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు కూడా వారి చేతిలో మోసపోతుంటారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు మోసపోయినప్పుడు.. ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు సెలబ్రిటీలను కూడా నేరగాళ్లు బురిడీ కొట్టిస్తుంటారు. ప్రస్తుతం మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ కూడా వారి ఉచ్చులో పడ్డారు. ఇటీవల ఓ రోజు అపరిచిత వ్యక్తి నుంచి కాంబ్లీకి ఫోన్ వచ్చింది. కాల్ కట్ అయ్యేలోపే తన బ్యాంక్ ఖాతాలోంచి లక్ష రూపాయలు హాంఫట్ అయ్యాయి. వివరాల్లోకి వెళితే..


భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ గురించి తెలియని క్రికెట్ అభిమానులు ఉండరు. వన్డేల్లో 32.59 సగటుతో పరుగులు చేసిన వినోద్ కాంబ్లీ, భారత్ తరఫున 17 టెస్టుల్లో 54.2 సగటుతో 1,084 పరుగులు చేశాడు. అదేవిధంగా 104 వన్డేల్లో 32.59 సగటుతో 2,477 పరుగులు చేసిన విషయం తెలిసిందే. అతంటి పేరున్న ఆయన్ను కూడా సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. ఇటీవల ఆయనకు అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తాను బ్యాంక్ అధికారినని పరిచయం చేసుకున్నాడు. దీంతో అతడితో కాంబ్లీ మాటలు కొనసాగించాడు. కేవైసీ డేటాను అప్‌డేట్ చేయాలని, అందుకోసం ఓ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆ వ్యక్తి సూచించాడు.

పొలంలో పశువులు మేపుతున్న మహిళ.. సాయంత్రం ఇంటికి తిరిగొస్తుండగా ఓ చెట్టు వద్ద కనిపించిందో షాకింగ్ సీన్..


అతడి మాటలు నమ్మిన కాంబ్లీ.. వెంటనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాడు. దీంతో ఆయన బ్యాంక్ వివరాలన్నీ వారికి చేరాయి. అనంతరం వన్‌‌టైమ్ పాస్‌వర్డ్ తెలుసుకుని.. రూ.1.1లక్షలు బదిలీ చేసుకున్నారు. తన బ్యాంక్ నుంచి నగదు విత్‌డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో కాంబ్లీ ఖంగుతిన్నాడు. వెంటనే బ్యాంక్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి, తన ఖాతాను హోల్డ్ చేయించాడు. అనంతరం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ వ్యక్తులు ఎవరు, ఆ నగదు ఎవరి ఖాతాలోకి బదిలీ అయిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

బీటెక్ పూర్తి కాకుండానే రూ.20 లక్షల ప్యాకేజీతో జాబ్ ఆఫర్.. ఆర్మీలో చేరాలన్న మక్కువతో రిజెక్ట్ చేసి మరీ..

Updated Date - 2021-12-10T23:26:12+05:30 IST