Kadiyam srihari: రాజయ్య చిలిపి చేష్టల రికార్డులు బయటపెడితే....

ABN , First Publish Date - 2022-08-30T19:30:17+05:30 IST

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనపై తీవ్రమైన ఆరోపణలు చేశారని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు.

Kadiyam srihari: రాజయ్య చిలిపి చేష్టల రికార్డులు బయటపెడితే....

జనగామ: స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Tatikonda Rajaiah) తనపై తీవ్రమైన ఆరోపణలు చేశారని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి (Kadiyam srihari) అన్నారు.  మంగళవారం మీడియాతో మాట్లాడిన కడియం... రాజయ్య(Staion ghanpur mla)కు సవాల్ విసిరారు. ‘‘స్టేషన్ ఘనపూర్‌లో పార్టీతో సంబంధం లేకుండా సర్వే చేద్దాం. ఎవరికి ప్రజలు మద్దతు ఇస్తే ఇది వారిదే అడ్డా. నా సవాల్‌కు రాజయ్య (TRS Leader) సిద్ధమా..?. రాజయ్య నా సవాల్ కు సూటిగా సమాధానం చెప్పాలి. నిజమైన ప్రజా నాయకుడెవరో తేల్చుకుందామా. నా సవాల్‌ను స్వీకరించకపోతే నాగురించి మాట్లాడొద్దు. పార్టీ ఎవరికి అవకాశం ఇస్తే దానికి కట్టుబడే పనిచేస్తా. ఇంతవరకు నీతి తప్పని నేతగా ఉన్నాను. రాజయ్య (TRS MLA) వ్యవహారం పార్టీ దృష్టికి తీసుకెళ్లాను’’ అని మాజీ డిప్యూటీ సీఎం తెలిపారు.


రాజయ్య చిలిపి చేష్టల రికార్డులు బయటపెడితే....

మంచి పనులు చేస్తే ప్రజలే గుర్తింపునిస్తారని తెలిపారు. మధ్యాహ్నమే తాగి, చిలిపి చేష్టలు చేస్తే ప్రజలు అసహ్యించుకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే రాజయ్య(MLA Rajaiah) బరితెగించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘‘నాకు పార్టీ నియమావళి అడ్డొస్తోంది. నేను మాట్లాడాలంటే కేసీఆర్ (Telangana CM) అడ్డొస్తున్నారు. రాజయ్య వ్యవహారాలన్నీ నా దగ్గర రికార్డు అయి ఉన్నాయి. రాజయ్య చిలిపిచేష్టల రికార్డులు నా దగ్గర ఉన్నాయి. నేను బయటపెడితే రాజయ్య ప్రజల్లో తిరగలేరు. నాకు సంస్కారం అడ్డొస్తోంది. దళితబంధు (Dalith bhandu) ఇస్తానని దావతులు చేసుకుంటోండు. ఒకవేళ రాకపోతే పేదల పరిస్థితి ఏంటీ. దళితబంధు ఇవ్వాలంటే దావతులు అక్కరలేదు. లబ్దిదారులు అందరూ ఆలోచించాలి. నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరంటే పేరు చెప్పుకోలేని పరిస్థితి దాపురించింది’’ అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.


స్టేషన్ ఘనపూర్ ఎవరి అడ్డా కాదు... ఎవరి జాగీరు కాదు

రాజయ్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రాజయ్యకు ఏదైనా ఇబ్బంది ఉంటే పార్టీ (TRS Party)కి చెప్పుకోవాలన్నారు. రాజయ్య తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్టేషన్ ఘనపూర్ ప్రజలు తలవంచుకునే పరిస్థితి తాను ఎప్పుడూ తెచ్చుకోలేదన్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా విమర్శింలేనంతగా ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నాట్లు తెలిపారు. స్టేషన్ ఘనపూర్ ఎవరి అడ్డా కాదు, ఎవరి గడ్డా కాదు, ఎవరి జాగీరుకాదని అన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎం చేశారని రాజయ్యను ప్రశ్నించారు. కాకిలా వెయ్యేండ్లు బతికేకంటే, కోకిలలా కొద్దిరోజులు బతికినా చాలన్నారు. ఎవరెక్కడా పోటీచేయాలన్నది పార్టీలు నిర్ణయిస్తాయని కడియం శ్రీహరి (Former deputy cm) వెల్లడించారు.



Updated Date - 2022-08-30T19:30:17+05:30 IST