ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు గిస్కార్డ్ మృతి

ABN , First Publish Date - 2020-12-03T12:51:33+05:30 IST

ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు గిస్కార్డ్ డి ఎస్టేయింగ్ కరోనాతో మరణించారు....

ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు గిస్కార్డ్ మృతి

పారిస్ (ఫ్రాన్సు) : ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు గిస్కార్డ్ డి ఎస్టేయింగ్ కరోనాతో మరణించారు. 1974 నుంచి 1981 వరకు ఫ్రాన్సు అధ్యక్షుడిగా పనిచేసిన గిస్కర్డ్ కు కొవిడ్ -19 సోకడంతో ఆసుపత్రిలో చేరారు. పర్యటనలో కరోనా సోకిన 94 ఏళ్ల గిస్కర్డ్ శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. సెప్టెంబరు 30వతేదీన చివరిసారి గిస్కార్డ్ కనిపించారు. అనంతరం హృద్రోగం, ఇతర ఆరోగ్య సమస్యలతో పలు సార్లు ఆసుపత్రిలో చేరారు. ఫ్రాన్సు దేశంలో పరస్పర అంగీకారం ద్వారా విడాకులకు అనుమతించడం, గర్భస్రావం చట్టబద్ధం చేసిన గిస్కర్డ్ రైలు నెట్ వర్కును నిర్మించారు. గిస్కర్డ్ మృతి పట్ల ఫ్రాన్సు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. ఇతను పశ్చిమజర్మనీ మాజీ ఛాన్సలర్ హెల్ముట్ ష్మిత్ తో సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్నారు. 

Updated Date - 2020-12-03T12:51:33+05:30 IST