Sanju Samson: సంజూ శాంసన్‌లో టాలెంట్‌ ఉంది కానీ.. ఈ మాటన్నది ఎవరంటే..

ABN , First Publish Date - 2022-06-16T03:35:40+05:30 IST

టీమిండియా యువ క్రికెటర్‌ సంజూ శాంసన్‌ ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఆదరగొట్టాడు. సంజూ శాంసన్‌ కెప్టెన్సీలో లీగ్‌ దశలో మంచి విజయాలు సాధించిన రాజస్తాన్‌ రాయల్స్‌.. రెండో సారి ఫైనల్‌ చేరినప్పటికి..

Sanju Samson: సంజూ శాంసన్‌లో టాలెంట్‌ ఉంది కానీ.. ఈ మాటన్నది ఎవరంటే..

టీమిండియా యువ క్రికెటర్‌ సంజూ శాంసన్‌ ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఆదరగొట్టాడు. సంజూ శాంసన్‌ కెప్టెన్సీలో లీగ్‌ దశలో మంచి విజయాలు సాధించిన రాజస్తాన్‌ రాయల్స్‌.. రెండో సారి ఫైనల్‌ చేరినప్పటికి.. గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఓటమి పాలైంది. ఇలాంటి సమయంలో మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సంజూ శాంసన్‌ స్థిరమైన ప్రదర్శన చేయడంలో దారుణంగా విఫలమవుతాడని వ్యాఖ్యానించాడు. సంజూ శాంసన్‌ కెప్టెన్‌గా అతను సమర్థుడే అయి ఉండొచ్చు. కానీ వరుసగా అవకాశాలు ఇస్తే ఒకటి రెండు మ్యాచ్‌ల్లో మంచి ఇన్నింగ్స్‌లు ఆడుతాడు. తప్పితే ఆ తర్వాత అదే స్థిరమైన ప్రదర్శన చేయడంలో మాత్రం దారుణంగా విఫలమవుతాడు. ఇది అతనిలో ఉన్న పెద్ద మైనస్‌ పాయింట్‌ అని కపిల్‌దేవ్‌ చెప్పుకొచ్చాడు. అలాగే ఒక వికెట్‌ కీపర్‌గా అతడిలో నిలకడ లేదని వెల్లడించాడు.



త్వరలో జరగబోయే టీ 20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని చూస్తే జట్టులో యువ ఆటగాళ్లకు కొదువలేదు. అన్ని విభాగాల్లో బ్యాటింగ్‌, స్టంపింగ్‌ చేయడంలో మంచి నైపుణ్యం కలిగిన వికెట్‌ కీపర్లు టీమిండియా సొంతమని చెప్పాడు. ఆ నలుగురిలో సంజూ శాంసన్‌, రిషభ్ పంత్‌, దినేశ్‌ కార్తీక్‌, ఇషాన్‌ కిషన్‌లు. బ్యాటింగ్‌, వికెట్‌ కీపింగ్‌లో మంచి నైపుణ్యం కలిగినవారు. తమదైన రోజున ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సత్తా వారికి ఉందని చెప్పుకొచ్చాడు. వృద్ధిమాన్ సాహా గురించి మాట్లాడితే.. ఈ నలుగురి కంటే అతడు మెరుగైన వికెట్ కీపర్. అయితే, బ్యాట్స్‌మెన్‌గా ఈ నలుగురూ మెరుగ్గా ఉన్నారని కపిల్‌ దేవ్‌ వెల్లడించాడు. ఇక ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ 20 మ్యాచ్‌ల సిరీస్‌కి సంజూ శాంసన్‌ను బీసీసీఐ ఎంపిక చేయలేదు. 2015లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి  అరంగేట్రం చేసిన సంజూ శాంసన్‌ ఇప్పటివరకు 13 అంతర్జాతీయ టీ 20 మ్యాచ్‌లు ఆడాడు.

Updated Date - 2022-06-16T03:35:40+05:30 IST