Rishabh Pant: మూడో టీ20లో గెలిచాం సరే.. కానీ భయమంతా రిషబ్ పంత్ గురించే.. ఎందుకంటే..

ABN , First Publish Date - 2022-06-15T22:22:58+05:30 IST

సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా కఠిన పరీక్ష ఎదుర్కొంటోంది. రిషబ్‌ పంత్‌ సారథ్యంలోని భారతజట్టు రెండు మ్యాచుల్లో ఓటమి పాలైంది. ఎట్టకేలకు మూడో మ్యాచ్‌లో..

Rishabh Pant: మూడో టీ20లో గెలిచాం సరే.. కానీ భయమంతా రిషబ్ పంత్ గురించే.. ఎందుకంటే..

సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా కఠిన పరీక్ష ఎదుర్కొంటోంది. రిషబ్‌ పంత్‌ సారథ్యంలోని భారతజట్టు రెండు మ్యాచుల్లో ఓటమి పాలైంది. ఎట్టకేలకు మూడో మ్యాచ్‌లో విజయం సాధించింది. టీ 20 సిరీస్‌ను సొంతం చేసుకోవాలంటే మరో రెండు మ్యాచుల్లో తప్పక విజయం సాధించాలి. ఈ సమయంలో కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌పై పలువురు మాజీ క్రికెటర్లు విమర్శనాస్త్రాలు సంధించారు. రిషభ్‌ పంత్ చెత్త నిర్ణయాలతో రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా ఓటమి పాలైందన్నారు. ఇక రిషబ్‌ పంత్‌ కెప్టెన్సీ బాధ్యతలపై భారత మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌ తన ప్రదర్శన కంటే సహచర ఆటగాళ్ల ఆటతీరు గురించే ఎక్కువగా ఆలోచిస్తాడని చెప్పుకొచ్చాడు. కొన్నిసార్లు నాయకత్వ బాధ్యతలు కెప్టెన్‌ ఆటతీరుపై ప్రభావం చూపుతాయని అన్నాడు.



గడిచిన మూడేళ్లుగా రిషబ్‌  పంత్‌ ఆటతీరు బాగుంది. ఆతని బ్యాటింగ్ మరింత మెరుగుపడింది. కానీ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాక.. ఆటతీరు గురించి ఎక్కువ ఆలోచించరని సునీల్‌ గవాస్కర్‌ వ్యాఖ్యానించాడు. దీంతో వారు తమ బ్యాటింగ్‌లో ఏదో సాంకేతిక సమస్య ఉందని లేదా బ్యాటింగ్‌ చేసే విధానంలో లోపం ఉందనే విషయాన్నే మార్చిపోతారని గుర్తు చేశారు. ఈ కారణంగానే పంత్‌ కూడా త్వరగా ఔట్‌ అవుతున్నాడని గవాస్కర్‌ చెప్పుకొచ్చాడు. అయితే మూడో టీ 20 మ్యాచ్‌లో టీమిండియా గెలవడం పంత్‌కు కాస్తా ఉపశమనం కలిగించిందని చెప్పాడు.

Updated Date - 2022-06-15T22:22:58+05:30 IST