దేశానికి ఎన్నో పతకాలు తెచ్చింది.. చివరకు రోడ్డుపై చేపలు అమ్ముకుంటోంది.. ఈ పరిస్థితికి కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-05-24T00:43:25+05:30 IST

దేశంలో పేద క్రీడాకారులకు సరైనా ప్రోత్సాహం, గౌరవం దక్కడం లేదు. ప్రభుత్వాల నుంచి సహకారం లభించక.. క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటలేక పోతున్నారు. ఆర్ధికంగా బాగున్న కొందరు క్రీడా

దేశానికి ఎన్నో పతకాలు తెచ్చింది.. చివరకు రోడ్డుపై చేపలు అమ్ముకుంటోంది.. ఈ పరిస్థితికి కారణం ఏంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో పేద క్రీడాకారులకు సరైనా ప్రోత్సాహం, గౌరవం దక్కడం లేదు. ప్రభుత్వాల నుంచి సహకారం లభించక.. క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటలేక పోతున్నారు. ఆర్ధికంగా బాగున్న కొందరు క్రీడాకారులు సొంత డబ్బులతో శిక్షణ తీసుకుంటున్నారు. పలు అంతర్జాతీయ క్రీడా వేదికలపై పతకాలను సాధిస్తున్నారు. కానీ పేద క్రీడాకారులపట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకేమీ పట్టన్నట్టే వ్యవహరిస్తున్నాయి. తాజాగా మణిపూర్‌ రాష్ట్రంలో ఓ కుంగ్‌ఫు క్రీడాకారిణి తన కుటుంబాన్ని పోషించుకునేందుకు రోడ్డుపై చేపలు అమ్ముకోవడం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 


జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో దేశానికి అనేక పతకాలు సాధించిన కుంగ్‌ఫు క్రీడాకారిణి అంగోమ్ బీనా దేవి జీవనోపాధి కోసం చేపలను విక్రయిస్తోంది. పలు అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్స్‌లో మూడు బంగారు పతకాలు, జాతీయ పోటీల్లో మరో మూడు బంగారు, రజత పతకాలను బినాదేవి కైవసం చేసుకుంది. కానీ ఇప్పటివరకు మణిపూర్‌ ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి ఆర్ధిక సాయం అందలేదని వాపోయింది. ఒక్కో ఛాంపియన్‌షిప్‌కు 20 వేల నుంచి 30 వేల రూపాయలు తన జేబులోంచి వెచ్చించాల్సి వచ్చినా క్రీడల్లో పాల్గొన్నందుకు ఎలాంటి ప్రోత్సాహకాలు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా తన దీనస్థితిని చూసి ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరింది.




Updated Date - 2022-05-24T00:43:25+05:30 IST