Alapati Raja: ఎన్టీఆర్ పేరు తీసేయడానికి ఎన్ని గుండెలు

ABN , First Publish Date - 2022-09-21T17:51:43+05:30 IST

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు దుర్మార్గపు ఆలోచన అని మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు.

Alapati Raja: ఎన్టీఆర్ పేరు తీసేయడానికి ఎన్ని గుండెలు

గుంటూరు: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ (NTR Health university) పేరు మార్పు దుర్మార్గపు ఆలోచన అని మాజీ మంత్రి ఆలపాటి రాజా (Alapati Raja) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... 26 ఏళ్లుగా తర్వాత ఈ రోజు ఎన్టీఆర్ (NTR) పేరు మార్చడం సిగ్గు చేటని మండిపడ్డారు. జగన్ రెడ్డి (Jagan mohan reddy) నిరంకుశత్వానికి ఇది నిదర్శనమన్నారు. తెలుగు వాడు ఎవ్వడూ ఈ చర్యను హర్షించడన్నారు. ‘‘ఎన్టీఆర్ పేరు తీసేయడానికి ఎన్ని గుండెలు. మంది ఉంటే సరిపోదు. మంచి బుద్ది ఉండాలి. సొమ్ము ఒకడిది.. సోకు మరోకడిదిగా ఉంది జగన్ రెడ్డి (AP CM) తీరు. గతంలో హెల్త్ యూనివర్సిటీ నిధులు పక్క దారి పట్టించావు. ఇప్పడు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ (YSR) పేరు పెడుతున్నావు. గతంలో మీ తండ్రి ఎయిర్ పోర్ట్‌కు ఎన్టీఆర్ పేరు తీసేసి రాజీవ్ గాంధీ (Rajeev gandhi) పేరు పెట్టాడు. పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా తల్లినే తీసేసిన వాడికి ఎన్టీఆర్ పేరు తీసేయడంలో ఆశ్చర్యం లేదు. జగన్ రెడ్డి(CM Jagan) సేవలో తరించిపోతున్న లక్ష్మీపార్వతి (Laxmi parvati), యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ (Yarlagadda laxmiparvati), జాస్తీ చలమేశ్వర్ (Jasti chalameshwar), లావు రత్తయ్య (Lavu rathaiah)లు స్పందించాలి’’ అని ఆలపాటి రాజా (Former Minister) డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-09-21T17:51:43+05:30 IST